ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య అఫ్గానిస్థాన్ పరిణామాలపై కీలక చర్చ జరిగింది. ఇరువురు దాదాపు 45 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడుకున్నారు. అఫ్గాన్ లో ప్రస్తుత పరిస్థితులపై అధ్యక్షుడు పుతిన్ తో కలిసి సుదీర్ఘంగా చర్చించినట్లు మోదీ తెలిపారు. అఫ్గాన్ అంశంతో పాటు కరోనా, ద్వైపాక్షిక అంశాలపైనా మాట్లాడినట్లు ప్రధాని ట్వీట్ చేశారు.
ఏంజెలా మెర్కెల్ తో..
జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ తోనూ సోమవారం చర్చలు జరిపారు మోదీ. అఫ్గాన్ సంక్షోభంపై ఇరువురు మాట్లాడుకున్నామని మోదీ ట్వీట్ చేశారు.
మరికొంతమంది..
మంగళవారం మరో 78 మంది అఫ్గానిస్థాన్ నుంచి దిల్లీ చేరుకున్నారు. వీరిలో 25మంది భారతీయులు కాగా.. 44 మంది అఫ్గాన్ సిక్కులు, మిగతావారు అఫ్గాన్ హిందువులు. వీరందరిని సోమవారం కాబుల్ నుంచి తజికిస్థాన్ రాజధాని దుశాంబేకు యుద్ధ విమానంలో తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానంలో మంగళవారం ఉదయం దిల్లీకి తీసుకొచ్చారు.
Also Read: Indian Students US Visa: ఆల్ టైమ్ రికార్డ్.. 55 వేల మంది భారతీయ విద్యార్థులకు యూఎస్ వీసాలు