London Teacher sends naked videos of herself to 15 year old boy: స్కూల్లో టీచర్, స్టూడెంట్ ప్రేమ కథలపై సినిమాలు వస్తే మనం నోళ్లు నొక్కుకుంటాం. అలాంటి సినిమాలో అఘాయిత్యాలకు కారణం అవుతున్నాయని నిందిస్తాం. కానీ అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో మహిళా టీచర్లు .. కంటికి నదురుగా కనిపించే మగ విద్యార్థుల్ని వదిలి పెట్టడం లేదు. రేపులు చేసేస్తున్నారు. ఇష్టపూర్వ శృంగారం కోసం ఒత్తిడి చేస్తూ దొరికిపోతున్నారు. అమెరికాలో ఇలాంటి కేసులు చాలా బయట పడుతూంటే.. తాజాగా లండన్‌లోనూ ఓ టీచర్ ఇలాంటి నిర్వాకమే చేయబోయి జైలు పాలయ్యారు.
లండన్‌లోని ఓ స్కూల్‌లో పని చేస్తున్న 33 ఏళ్ల టీచర్‌నుు వేల్స్ పోలీసులు అరెస్టు చేశారు. కారణం ఏమిటంటే స్కూల్లో చదువుకుంటున్న పదిహేనేళ్ల పిల్లవాడిని ఈ టీచర్ శృంగారం కోసం ఒత్తిడి చేస్తోంది. అంతే కాదు నగ్నంగా ఉండే తన ఫోటోలు, వీడియోలను పదే పదే పంపుతోంది. తాను అత్యంత ఆకర్షణీయంగా ఉంటానని.. విద్యార్థులు అందరూ తన ఒంపుసొంపుల్ని చూసి పిచ్చెక్కిపోతారని చెబుతూ ఉండేది. ఇలా రోజూ వీడియోలు పంపడమే కాదు.. ఫోన్లు చేసి మాట్లాడుతూ రెచ్చగొట్టేది. ఇంటికి వస్తే శృంగారంలో అన్నీ నేర్పుతానని ఒత్తిడి చేసేది.
స్నాప్ చాట్‌లో రెగ్యులర్ గా ఆ విద్యార్థితో అసభ్యంగా మాట్లాడేది. తాను నిన్ను ఊహించుకుని నిద్రపోతూంటానని చెప్పేది. ఇలాంటివి ఆ విద్యార్థి భరిస్తూనే ఉన్నాడు. ఇంటికి రమ్మని పిలిచినా పదిహేనేళ్ల ఆ బాలుడు మాత్రం భయంతో వెళ్లేవాడు కాదు. ఓ సారి ఈ విషయాన్ని తన కుటుంబసభ్యులకు చెప్పడంతో మొత్తం స్నాప్ చాట్ హిస్టరీని చూశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ టీచర్ స్నాప్ చాట్ హిస్టరీని చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే ఆమెను అరెస్టు చేశారు.
పదిహేనేళ్ల బాలుడ్ని శృంగారానికి ఒత్తిడి చేయడం బ్రిటన్ లో నేరం. మైనర్ కిందకే ఆ బాలుడు వస్తాడు. అందుకే పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. మొదట్లో తానేమీ ఆ బాలుడ్ని లైంగికంగా వేధించలేదని పోలీసులతో వాదించింది. అయితే స్నాప్ చాట్ ఆధారాలు ఉండటం.. ఆ బాలుడు కూడా జరిగింది ఏమిటో స్పష్టంగా చెప్పడంతో దొరికిపోక తప్పలేదు. ఈ టీచర్ వ్యవహారం లండన్‌లో చర్చనీయాంశమయింది.