Italian nun arrested over links to powerful mafia network: ఇటలీ కేంద్రంగా డ్రగ్స్ సహా అనేక దందాలు చేసే ఓ మాఫియా గ్యాంగ్ ఉంది. దీనికి ఎన్‌డ్రాంగెటా మాఫియా నెట్ వర్క్ అనే పేరు ఉంది. హత్యలు, ఖూనీలు, డ్రగ్స్ స్మగ్లింగ్ సహా ఎన్నెన్ని దందాలు చేస్తారో లెక్కే లేదు. మొత్తం నలభై దేశాల్లో ఈ మాఫియా నెట్ వర్క్ విస్తరించి ఉందని పోలీసులకు సమాచారం ఉంది. ఈ నెట్ వర్క్ సంగతి చూడాలని చాలా ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నారు. కానీ సాధ్యం కావడం లేదు. ఎందుకు సాధ్యం కావడం లేదో వారికీ అర్థం కాలేదు. కొంత మందిని అరెస్టు చేసి జైల్లో పెట్టినా ఎలాంటి సమాచారం అందకుండా చేసినా మాఫియా కార్యకలాపాలు మాత్రం ఆగడం లేదు. దీంతో ఇటలీ పోలీసులు ఇటీవల ఓ కొత్త ఆపరేషన్ నిర్వహించారు. అందులో దొరికి నసమాచారం ఆధారంగా మెల్లగా తీగ లాగితే అది ఎవరి దగ్గరకు చేరిందో చూసుకుని ఆశ్చర్యపోయారు. చివరికి నమ్మాలా వద్దా అని ఒకటికి పది సార్లు క్రాస్ చెక్ చేసుకుంటే ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందేనని సమాచారం బయటకు వచ్చింది. ఇంతకీ ఆ మాఫియా నెట్ వర్క్‌లో ఉన్నది ఎవరో తెలుసా.. ఓ నన్. కేథలిక్ చర్చిలో అన్నీ వదిలేసి సన్యాసం తీసుకున్న నన్.
ఇటీవల ఇటలీ పోలీసులు సిస్టర్ అన్నా దొనెల్లి అనే నన్‌ను అరెస్టు చేశారు. న్‌డ్రాంగెటా మాఫియా నెట్ వర్క్ లో ఆమెది చాలా కీలక పాత్ర అని గుర్తించడంతో అరెస్టు చేశారు. సిస్టర్ అన్నా దొనెల్లి చాలా కాలంగా మాఫియా నెట్వర్క్ లో భాగంగాఉన్నారు. అరెస్ట్ అయిన మాఫియా సభ్యుల్ని జైల్లో పెడతారు. అక్కడ్నుంచి సమాచారం రావాలన్నా.. వారికి సమాచారం పోవాలన్నా ఓ కొరియర్ ఉండాలి. అందుకే మాఫియాలో అత్యంత కీలకంగా వ్యవహిరంచే సిస్టర్ అన్నా దొనెల్లి వ్యూహాత్మకంగా అండర్ కవర్ అపరేషన్ తరహాలో నన్ గా మారిపోయారు. ఇటలీలోని ప్రసిద్ధ చర్చిలో చేరిపోయారు. అక్కడ అందరి అభిమానాన్ని పొందారు.
చర్చి తరపున జైల్లో ఖైదీలకు సేవలు అందించేందుకు ఎంపికయ్యేలా చూసుకున్నారు. అప్పట్నుంచి సిస్టర్ అన్నా దొనెల్లి పని అదే. సేవల కోసం జైలుకు వెళ్లడం మాఫియాకు కావాల్సిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునిరావడం జరుగుతూ ఉండేది. చాలా ముంది మాఫియా నేతలు జైల్లో ఉన్నా తమ పని తాము పూర్తి చేసేవారు.. అది ఎలా జరిగేదో పోలీసులకూ అంతు చిక్కేది కాదు. అలా అని ఎవర్నీ అనుమానించలేకపోయేవారు. జైలు అధికారులు ఎవరైనా లంచాలకు కక్కుర్తి పడుతున్నారేమో అనుకునేవారు. అయితో ఏ సారి ఓ మాఫియా సభ్యుడు పోలీసులకు చిక్కినప్పుడు దొరికిన చిన్న ఆధారంతో తీగ లాగడంతో అది సిస్టర్ అన్నా దొనెల్లి కి చేరింది. దీంతో పోలీసులు అరెస్టు చేశారు.
Also Read: భారత్‌ను పదే పదే రెచ్చగొడుతున్న బంగ్లాదేశ్ - ఉక్రెయిన్ పరిస్థితి చూస్తూ ఎందుకలా చేస్తున్నారు ?
57 ఏళ్ల సిస్టర్ అన్నా దొనెల్లి ఎంత పకడ్బందీగా వ్యవహరించేవారంటే.. ఆమెకు నన్ గా సేవలు అందించడం తప్ప మరో అంశంపై ఆసక్తి లేనట్లుగా ఉండేవారు. ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరించేవారు. అయితే ఎంతటి మాఫియా డాన్ అయినా ఏదో ఓ సందర్భంలో దొరికిపోవాల్సిందే. ఇప్పుడు అదే జరిగింది. అయితే ఈ సిస్టర్ అన్నా దొనెల్లి దొరికిపోవడంతో ఆ ప్రసిద్ధ మాఫియా సామ్రాజ్యం కుప్పకూలుతుందో లేదో కానీ.. జైల్లో ఉండే వారి సభ్యులకు.. బయట ఉండే వారికి కమ్యూనికేషన్ మాత్రం కట్ అయిపోతుందని ఇది పెద్ద విజయమని పోలీసులు నమ్మకంతో ఉన్నారు.