Bangladesh Vs  India : బంగ్లాదేశ్ ఉద్దేశపూర్వకంగా భారత్ ను రెచ్చగొడుతోంది. సరిహద్దుల్లో అలజడి పెంచేలా వ్యవహరిస్తోంది. పరిస్థితి ఎలా ఉందంటే చివరికి యుద్దానికి కూడా సిద్ధమని అంటున్నట్లుగా అక్కడి తాత్కలిక పాలకులు బెదిరింపులకు దిగుతున్నారు. అక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం లేదు. ప్రభుత్వాధినేతను దేశం నుంచి తరిమేశారు. ఆ దేశాధినేత భారత్ లో తలదాచుకున్నారని కోపమో.. లేకపోతే చైనా, పాకిస్తాన్‌లతో కలిసి భారత్ పై ఏమైనా కుట్ర చేస్తున్నారేమో కానీ సరిహద్దుల్లో  భారత్ ను రెచ్చొగట్టేలా సైనిక కదలికలు,నిఘా కదలికలు పెంచుతున్నారు. ఇది భారత్ కూడా యుద్ధానికి సన్నద్ధం అయ్యేలా చేస్తోంది.              


ఆయుధాల్లేని బంగ్లాదేశ్                


భారత ఆయుధ సంపత్తితో పోలిస్తే బంగ్లాదేస్ దగ్గర దాదాపుగా ఏమీ లేవు.  భారత్ వద్ద 606 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. అందులో క్షణంలో టార్గెట్ ను చేధించే ఫైటర్ జెట్స్ ఉన్నాయి. బంగ్లాదేశ్ దగ్గర ఉన్న ఫైటర్ జెట్స్ 44 మాత్రమే. భారత్ ప్రపంచంలోని నాలుగో అతి పెద్ద సైనిక సంపత్తి ఉన్న దేశం. కానీ బంగ్లాదేశ్ 37వ స్థానంలో ఉంటుంది. భారత వాయసేన ఎంత బలంగా ఉందంటే.. ఒక్క సారి నేరుగా దాడి చేస్తే..  బంగ్లాదేశ్ వాయుసేనకు ఉన్నవి మొత్తాన్ని నాశనం చేసేసి వస్తాయి. రాఫెల్, తేజస్, సుఖోయ్ వంటి వాటి దాడిని  బంగ్లాదేశ్ తట్టుకోలేదు. భారత్ కు మొత్తం గా 2296 ఎయిర్ క్రాఫ్ట్‌లు ఉన్నాయి. బంగ్లాదేశ్ వద్ద ఉంది 216 మాత్రమే. 


భారత్ వద్ద అణుబాంబు            


ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ విషయంలోనే కాదు భారత్ తో ఏ విషయంలోనూ పోటీ పడలేని స్థితిలో బంగ్లాదేశ్ ఉంది. సైనికులు కూడా భారత్ కు ఉన్న దాంట్లో పదిశాతం కూడా ఉండరు. అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే భారత్ వద్ద అణుబాంబులు ఉన్నాయి. బంగ్లాదేశ్ దగ్గర అవి లేవు. అయితే ఏ రకంగానూ భారత్ తో సరి తూగే పరిస్థితి లేదు. దాడులు అంటే చూస్తే రెండు, మూడు రోజులలో బంగ్లాదేశ్ పరిస్థితి ఫనిష్ అవుతుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు.అయినా  భారత్ ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. 


ఉక్రెయిన్ లా బంగ్లా పరిస్థితి అవుతుందా ?               


రష్యా పొరుగుదేశం ఉక్రెయిన్.. తమకు ముప్పు వస్తే నాటో దేశాలు అండగా ఉంటాయని అనుకుంటూ రష్యాతో కయ్యం పెట్టుకుంది. తీరా రష్యా దాడి చేస్తే నాటో దేశాలు పట్టించుకోలేదు. ప్రస్తుతం ఉక్రెయిన్ ఒంటరిగా మారింది. నాటో దేశాలు..రష్యాపై బాంబులేయడానికి ఆయుధాలు ఇస్తున్నాయి కానీ యుద్దం ఆపేసి ఉక్రెయిన్ ను  బయట పడేద్దామని ప్రయత్నించడం లేదు. చైనా, పాకిస్తాన్ వంటి దేశాల సపోర్టుతో బంగ్లాదేశ్ రెచ్చగొడితే భారత్ ఊరుకునే అవకాశం లేదు. అలా చేస్తే ప్రస్తుత బంగ్లాదేశ్ పాలకులు తమ దేసాన్ని తాము చేజేతులా నాశనం చేసుకున్నట్లే అవుతుంది. 



Also Read: US Army Training In Thailand: ఆకలేస్తే తేళ్లు, బల్లులు తినాలి- దాహం వేస్తే పాము రక్తం తాగాలి? థాయ్‌లాండ్‌లో అమెరికా సైనికులకు శిక్షణ