Us army: మాములుగా సైనిక శిక్షణ అంటే ఎలా ఉంటుంది. బరువైన వస్తువులను ఎత్తడం, ఎత్తైన ప్రదేశాలను తాళ్లతో ఎక్కడం, కఠినమైన నేలపై దొర్లుకుంటూ ముందుకు సాగడం.. ఇలాంటివే మన మదిలోకి వస్తాయి. అయితే థాయ్ లాండ్ లో జరిగే అమెరికన్ సైనికులకు శిక్షణ వీటికి భిన్నంగా ఉంటుంది. వాటి గురించి వింటేనే కడుపులో దేవేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు..


సర్వైవల్ టెస్టింగ్..
నిజానికి సైనికులు చాలా కఠినమైన పరిస్థితుల్లో పని చేయాల్సి ఉంటుంది. ఎడారుల్లో, తీవ్రంగా మంచుకురిసే ప్రాంతాల్లో, పెద్ద పెద్ద కీకారణ్యాల‌్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా పని చేసేలా వారికి శిక్షణ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే అమెరికన్ కోబ్రా గోల్డ్ సైనిక శిక్షను రూపొందించారు. ప్రతి సంవత్సరం అమెరికన్ మెరైన్ సైనికులకు అత్యంత కఠినమైన శిక్షణ ఇస్తున్నారు. దట్టమైన అడవుల్లో సర్వైవ్ కావడం కోసం డిజైన్ చేసింది ఈ ప్రొగ్రామ్. అందులో భాగంగా కొన్నిసార్లు ఆహారం దొరకని పరిస్థితుల్లో కీటకాలు, తేళ్లు, బల్లులు, పాములు వంటి సజీవ జీవులను తినాల్సి ఉంటుంది. వామ్మో.. ఊహిస్తేనే ఎంత భయంకరంగా ఉంది కదా.. ఇలాంటి శిక్షణను ప్రతి ఏడాది థాయ్ లాండ్ లో ఇస్తారు. 


ఆహరం దొరకని పరిస్థితుల్లో..
ఈ ట్రైనింగ్ లో భాగంగా , ఒకవేళ అడవిలో చిక్కుకుపోయినట్లయితే ఎలా బతకాలో నేర్పిస్తారు. పాములు, తేళ్లలో రకాలను గుర్తించడం, వాటని నేర్పుగా ఎలా హతమార్చి, ఆకలి తీర్చుకోవాలో నేర్పిస్తారు. ఇక్కడ ఒళ్లు గగుర్పొడిచే విషయం ఏమంటే.. నీళ్లు దొరకని పరిస్థితుల్లో పాము రక్తాన్ని తాగేందుకు అవసరమైన ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ ద్వారా సైనికుల్లో మానసిక, శారీరక ధైర్యాన్ని పెంపొందించేలా డిజైన్ చేశారు. 


పెటా అభ్యంతరం..
కోబ్రా గోల్డ్ ట్రైనింగ్ పై ప్రముఖ జంతు హక్కుల సంస్త పెటా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. ఇలా సజీవ జంతువులను భుజించే కార్యక్రమం అమానీయమని, హేయమని చాలా కాలంగా ప్రచారం చేస్తుండటంతో, ప్రస్తుతానికి పాము రక్తం తాగే ప్రొగ్రామ్ ను మాత్రం నిలిపేశారు. అయితే ఈ శిక్షణలో పాల్గొన్న చాలామంది సైనికులు తమ అనుభవాలను పంచుకున్నారు. పాము రక్తం తీయగా ఉంటుందని, అయినా కూడా దాన్ని తాగడానికి మనసు ఒప్పలేదని అంగీకరించారు. ఈ ప్రక్రియ తమ జీవితంలో అత్యంత క్లిష్టమైన పనిగా దాన్ని అభివర్ణించారు. 


కొత్త పద్దతిలో కోబ్రా గోల్డ్ ట్రైనింగ్..
ప్రస్తుతం ఈ ట్రైనింగ్ రూపురేఖలను నిర్వాహకులు మార్చారు. ఎక్కువగా ఆధునిక, మానవీయ పద్ధతులపైనే దృష్టి సారించారు. ఆపద సమయాల్లో ప్రాణులకు ఎలాంటి హానీ కలుగ నీయకుండా సాంకేతిక, వ్యూహాత్మక నైపుణ్యాలను పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాలను డిజైన్ చేశారు. 


1982 ట్రైనింగ్ ప్రారంభం..
ద కోబ్రా గోల్డ్ ట్రైనింగ్  ప్రొగ్రామ్ అనేది థాయ్ లాండ్, అమెరిక దేశాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందిచేందుకుగాను 1982లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇరుదేశాలకు చెందిన సైనికలకు శిక్షణ ఇచ్చారు. మరోవైపు ఈ ప్రొగ్రామ్ లో 29 దేశాలకు స్థానం కల్పించారు. ఇండోనేసియా, మలేసియా, సింగపూర్, సౌత్ కొరియా లాంటి దేశాల సైనికులు ఈ శిక్షణ తీసుకుంటున్నారు. 


Also Read: డేంజర్ బెల్స్- ఆ ఉద్యోగులకు మాత్రం పీడకలగా మారిన 2024