ప్రపంచ దేశాలకు(World Countries).. ప్రతిసారీ ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. కొన్నాళ్లు మహమ్మారి కరోనా(Covid-19) వెంటాడితే.. మరికొన్నాళ్లు రష్యా-ఉక్రెయిన్(Russia-Ukarin) దేశాల మధ్య యుద్ధం కంటిపై కునుకు లేకుండా చేసింది. ఇది కేవలం ఆ రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచ దేశాల్లో ఆర్థిక మాంద్యాన్ని పెంచేలా చేసింది. అంతేకాదు.. నిత్యం వినియోగించే వంటనూనెలపైనా(Oils) ప్రభావం చూపించింది. యుద్ధం కారణంగా.. ఆ రెండు దేశాల పరిస్థితి ఎలా ఉన్నా.. అసలు యుద్ధంతో సంబంధం లేని భారత్(India) సహ అనేక దేశాలపైనా ప్రభావం పడింది.
ఇప్పుడు ఏంటి?
ఇప్పుడు ఇలాంటి పెను ఉపద్రవమే.. ప్రపంచ దేశాలకు గుదిబండగా మారింది. మరోసారి ఆర్థిక సంక్షోభం(Financial Disturbence) భయాలు కూడా పట్టుకున్నాయి. దీనికి కారణం హౌతీ(Houthi) ఉగ్రవాదులు. పాలస్తీనా(Palastina)లోని హమాస్ ఉగ్రవాదుల కు మద్దతు ఇస్తున్న హౌతీలు.. ఎర్ర సముద్రం(Red Sea)లో చేస్తున్నరచ్చ అంతా ఇంతాకాదు. ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఉన్న ప్రపంచ దేశాలను వీరు శాసించే పరిస్థితికి వచ్చారు. ఎర్ర సముద్రం మీదుగా.. జరుగు తున్న వ్యాపార లావాదేవీలకు వీరు పెను సంకటాలనే సృష్టిస్తున్నారు.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా
ఎర్ర సముద్రం మీదుగా జరిగే వాణిజ్య కార్యకలాపాలు(Trade Activities) ఎంతో విస్తృతంగా ఉంటాయి. రోమన్ కంట్రీస్‌కు ఇతర దేశాలతో అనుసంధానం కేవలం ఎర్ర సముద్రం ద్వారానే జరుగుతోంది. రాకపోకలు సహా.. వాణిజ్య వ్యవహారాలకు ఎర్ర సముద్రమే కీలక పాత్ర పోషిస్తోంది. ఇలాంటి సమయంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హౌతీ ఉగ్రవాదులు(Houthi Extrimists) విజృంభిస్తున్నారు. అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై యాంటీ షిప్ బాలిస్టిక్(Balistick) క్షిపణులతో విరుచుకుపడుతున్నారు. దీంతో సముద్ర రవాణా దాదాపు నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. ఇది.. ఇటు అగ్రదేశాలకు.. అటు సరుకు అవసరమైన దేశాలకు కూడా ఇబ్బందిగా మారిపోయింది.
ఎవరీ హౌతీలు..
రోమన్ సామ్రాజ్యం పతనం అయిన తర్వాత.. ఏర్పడిన యెమెన్(Yemen) దేశంలో ముస్లిం పాలకులు రాజ్యాధికా రం దక్కించుకున్నారు. ఇది కొన్నాళ్లు బాగానే సాగినా.. 1990లకు వచ్చే సరికి పరిస్థితి మారిపోయింది. ఎటు చూసినా అవినీతి పెరిగిపోయింది. నియంతృత్వ పోకడలు కూడా పెరిగాయి. దీనిని ఎదిరించేందు కంటూ.. యెమెన్‌లోని షియా ముస్లిం తెగకు చెందిన జైదీ(Jaidi)లు.. గ్రూపులుగా ఏర్పడి.. సాయుధ పోరాటానికి తెగించారు. తర్వాత.. కాలంలో వీరే హౌతీలుగా మారారు. "దేవుడు గొప్పవాడు, అమెరికాకు మరణం, ఇజ్రాయెల్‌కు మరణం, యూదులపై శాపం, ఇస్లాంకు విజయం`` అనే నినాదాలతో వీరు పేట్రేగి పోతున్నారు. వీరి నాయకుడు హుసేన్ అల్ హౌతీ(Hussain Ali Houthi). ఈయన పేరుతోనే హౌతీగా ఏర్పాడ్డారు. తర్వాత.. ఉగ్ర వాదులతో సంబంధాలు పెట్టుకున్నారనే వాదన ఉంది.
పాలస్తీనాకు మద్దతు
హౌతీలు ప్రధానంగా పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులకు మద్దతుగా ఉన్నారు. తాము చేస్తున్న దాడులకు హమాస్ మద్దతివ్వడంతో .. హౌతీలు ఇప్పుడు ఇజ్రాయెల్(Esrael)కు వ్యతిరేకంగా హమాస్ చేస్తున్న యుద్ధానికి మద్దతు ఇస్తున్నారు. మొత్తానికి హౌతీలు కూడా.. మారణ కాండకు దిగుతున్నారు. ఇజ్రయెల్‌కు మద్దతు ఇస్తున్నారన్న అక్కసుతో ఎర్ర సముద్రం(Red Sea) మీదుగా ఇతర దేశాల నుంచి వచ్చే నౌకలపై డ్రోన్‌లు, మిస్సైళ్లతో దాడులకు తెగబడుతున్నారు. గత ఏడాది నవంబరు, డిసెంబరు మధ్య హౌతీ ఉగ్రమూకల(Extremists) బెడద మరింతగా పెరిగిపోయింది. వీరు ఏకంగా అధునాత క్షిపణి వ్యవస్థను వినియోగిస్తున్నారనేది అమెరికా ఆరోపణ.
హౌతీల లక్ష్యం ఇదేనా?
హౌతీల లక్ష్యం ఏంటి? అంటే.. ఒక్కమాటలో చెప్పాలంటే.. యెమెన్ దేశాన్ని హస్తగతం(Own) చేసుకోవడం. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మారణ కాండ కొనసాగిస్తున్నారు. తమకు మద్దతిచ్చేవారికి అండగా నిలుస్తున్నారు. తమ మిత్రుల(Friends)కు హాని తలపెట్టేవారిపై కన్నెర్ర చేస్తున్నారు. యెమెన్‌లో అధికారం దక్కించుకునేందుకు 2014 నుంచి హౌతీ(Houthi)లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అంతర్యుద్ధంతో అల్లాడిపోయేలా చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరాన్ కూడా వీరికి సహకరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే.. యెమెన్‌కు మరోవైపు.. సౌదీ(Soudi), యూఏఈ(UAE) సహా కొన్ని అరబ్ దేశాలు.. అండగా ఉంటున్నాయి. హౌతీలను ఎదుర్కొనడంలో ఇవి సాయం చేస్తున్నాయి. అయినప్పటికీ.. హౌతీలకు అడ్డుకట్ట పడడం లేదు.
హెజ్బుల్లా శిక్షణ
హౌతీ తీవ్ర వాదులకు.. లెబనాన్(Lebanan) కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న నిషేధిత సంస్థ హెజ్బుల్లా(Hejbulla) శిక్షణ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఆయుధాలు, మందుగుండు ప్రయోగం వంటివాటిలో శిక్షణ ఇవ్వడంతోపాటు.. వాటిని సరఫరా కూడా చేస్తున్నట్టు అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. పనిలోపనిగి యెమెన్‌ను నిర్వీర్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఇరాన్(Iran) కూడా హౌతీల పక్షంగానే నిలిచింది. వారికి మిస్పైళ్లను కూడా ఈ దేశమే సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిని అమెరికా(America) రక్షణ వర్గాలు కూడా ధ్రువీకరిస్తున్నాయి. మొత్తంగా హౌతీలు పేట్రేగి పోతుండడంతో ప్రపంచదేశాలకు కంటిపై కునుకు లేకుండా పోయిందని అంటున్నారు అంతర్జాతీయ పరిశీలకులు. ఇజ్రాయెల్ దూకుడు తగ్గితేనే తాము తగ్గుతామని హౌతీ ఉగ్రవాదులు ప్రకటిస్తుండడం గమనార్హం.