Houthi Mischief in the Red Sea: ఇజ్రాయెల్‌(Israel)-హ‌మాస్(Hamas) యుద్ధం నేప‌థ్యంలో హమాస్‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన హౌతీలు.. ఎర్ర‌స‌ముద్రం(Red sea)లో ఓడ‌ల‌ను అడ్డుకుని ధ్వంసం చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనిపై ప్ర‌పంచ వ్యాప్తంగా ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. హౌతీ(Houthi)ల‌ను క‌ట్ట‌డిచేసేందుకు అమెరికా(America), బ్రిట‌న్‌(Briton)లు చ‌ర్య‌లు తీసుకున్నాయి. అయిన‌ప్ప‌టికీ హౌతీలుమాత్రం ఏదో ఒక రూపంలో రెచ్చిపోతున్నారు. తాజాగా ఎర్ర స‌ముద్రం గ‌ర్భంలోని ప్ర‌పంచ దేశాల‌కు చెందిన స‌మాచార కేబుళ్ల‌ను ధ్వంసం చేశారని అంత‌ర్జాతీయ మీడియా పేర్కొంది. ప్ర‌పంచ దేశాల మ‌ధ్య సంబంధ బాంధవ్యాల‌ను బ‌లోపేతం చేయ‌డంలో సమాచార వ్య‌వస్థ కీల‌క‌మ‌నే విష‌యం తెలిసిందే. ముఖ్యంగా భార‌త్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు.. ఈ వ్య‌వ‌స్థ‌పై ఆధార‌ప‌డ్డాయి. ఇలాంటి వ్య‌వ‌స్థ‌ను ధ్వంసం చేయడం ద్వారా హౌతీలు తమ పంతం నెగ్గించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. 


అంత‌ర్జాతీయంగా ఆందోళ‌న‌!


ప్రపంచ కమ్యూనికేషన్‌(World Communication) వ్యవస్థకు కీల‌క‌మైన‌.. ఎర్ర స‌ముద్రంలోని కేబుల్ వ్య‌వ‌స్థ‌ను హౌతీలు ధ్వంసం చేసిన‌ట్టు తెలిసింది. ముఖ్యంగా భారత్‌-బ్రిటన్(India-Briton) దేశాల మధ్య ఉన్న కమ్యూనికేషన్‌ లైన్‌ సహా నాలుగు దేశాల‌కు చెందిన స‌మాచార వ్య‌వ‌స్థ‌పై దాడులు చేసినట్లు అంత‌ర్జాతీయ మీడియా వెల్ల‌డిస్తోంది. హౌతీలు ధ్వంసం చేసిన వాటిలో భారత్‌-ఐరోపా(Inida-Europe) మధ్య సేవలు అందించేవే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని తెలిసింది. యెమన్‌ తీర జలాల అడుగు నుంచి ఏర్పాటు చేసిన 4 కమ్యూనికేషన్ అతిపెద్ద వ్య‌వ‌స్థ‌ల‌ను హౌతీలు ధ్వంసం చేసిన‌ట్టు ప‌లు దేశాలకు చెందిన‌ మీడియా సంస్థ‌లు జెరూస‌లేం పోస్ట్‌, గ్లోబెక్స్ వంటివి వెల్ల‌డించింది. హౌతీ దాడుల్లో ధ్వంస‌మైన కేబుళ్ల‌ను ప‌రిశీలిస్తే.. ఏఏఈ-1, సీకామ్‌, యూరప్‌-ఇండియా గేట్‌వే, టాటా గ్లోబల్‌ నెట్‌వర్క్ ఉన్నాయ‌ని స‌మాచారం. 


చెప్పి మ‌రీ చేశారా?


హ‌మాస్‌కు అనుకూలంగా ఉన్న హౌతీలు.. ఇజ్రాయెల్‌కు మ‌ద్ద‌తు ఇచ్చే దేశాల‌పై విరుచుకుప‌డుతున్నా రు. ఈ క్ర‌మంలో ఎర్ర స‌ముద్రాన్ని అడ్డాగా చేసుకుని రెచ్చిపోతున్నారు. ఈ నేప‌థ్యంలో అమెరికా సేనలు దాడుల‌కు సిద్ధ‌మ‌య్యాయి. హౌతీల అంతు చూస్తాని అగ్ర‌రాజ్యం కూడా ప్ర‌క‌టించుకుంది. ఈ నేప‌థ్యం లో.. సముద్ర గర్భ ఇంటర్నెట్‌ కేబుళ్లను ధ్వంసం చేస్తామని హూతీలు హెచ్చరించారు.  ఈ మేరకు వారు టెలిగ్రామ్‌లో సందేశాలు ఉంచారు. అనుకున్న‌ట్టుగానే తాజాగా 4 కీల‌క కేబుళ్ల‌ను వారు ధ్వంసంచేసిన‌ట్టు తెలిసింది. హూతీలు డైవర్లు, నౌకలకు వాడే మైన్లను వినియోగించి వీటిని ధ్వంసం చేసి ఉంటార‌ని అంత‌ర్జాతీయ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.   


ఎంత ప్ర‌భావం అంటే..!


ఎర్ర‌స‌ముద్రంలో ప్రస్తుతం 300కు పైగా కీలక ఫైబర్ ఆప్టిక్ ఫైబ‌ర్‌ లైన్లు ఉన్నాయి. ఫోన్‌కాల్స్‌, రోజువారీ జరిగే బిలియన్‌ డాలర్ల కొద్దీ అంతర్జాతీయ నగదు లావాదేవీలు, దౌత్య సందేశాలు వంటివి వీటి నుంచే జరుగుతుంటాయి. ప్రపంచ కమ్యూనికేషన్లలో 90శాతానికి ఇవే ఆధారం. భారత్‌కు వివిధ ప్రాంతాలతో జరిగే కమ్యూనికేషన్లలో 50శాతం, ఖతర్‌కు 60శాతం, ఒమన్‌కు 70శాతం, యూఏఈకి 80శాతం, కెన్యాకు 90శాతం ఈ మార్గం నుంచే వెళతాయి.


ధ్వంస‌మైన కేబుళ్లు ఇవే.. 


ఏఏఈ-1(AAE-1) కేబుల్‌:
ఇది తూర్పు ఆసియాను ఈజిప్ట్‌ మీదుగా ఐరోపాతో అనుసంధానిస్తుంది. అంతేకాదు.. చైనాను ఖతర్‌, పాకిస్థాన్‌ మీదుగా పశ్చిమ దేశాలతో కలుపుతుంది.


యూరప్‌ ఇండియా గేట్‌వే (EIG) కేబుల్‌: 
దక్షిణ ఐరోపా ప్రాంతం మీదుగా ఈజిప్ట్‌, సౌదీ, జిబూటి, యూఏఈ, భారత్‌కు కమ్యూనికేషన్‌ సేవలు అందిస్తుంది.


సీకామ్‌(C-Com) కేబుల్‌: 
ఐరోపా, ఆఫ్రికా, భారత్‌, దక్షిణాఫ్రికా దేశాలను అనుసంధానిస్తుంది. సీకామ్‌-టాటా కమ్యూనికేషన్స్‌ కలిసి పనిచేస్తాయి.