Khalistani Attack On Hindu In Canada: కెనడా బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంలోపై ఖలీస్తానీ మద్దతుదారులు దాడి చేశారు. పూజలు చేసేందుకు వచ్చిన భక్తులను విచక్షణరహితంగా కొట్టారు. ఖలిస్థానీ జెండాలు చూపిస్తూ నినాదాలు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతున్నాయి. ఒక గుంపు, కర్రలు, రాడ్లు పట్టుకుని, ఆలయం వెలుపల హిందూ భక్తులపై దాడి చేస్తున్నారు. గుంపులో చాలా మంది వ్యక్తులు ఖలిస్తానీ అనుకూల గ్రూపులతో సంబంధం ఉన్న జెండాలు చేతపట్టుకొని ఉన్నారు. 


దాడిని ఖండించిన ఎంపీ చంద్ర ఆర్య


హిందూ సభ ఆలయ సముదాయంలో జరిగిన దాడిపై కెనడా ఎంపీ చంద్ర ఆర్య స్పందించారు. జరిగిన దాడిని ఖండించారు. ఖలిస్థానీ తీవ్రవాదులు రెడ్ లైన్‌ దాటారని అభిప్రాయపడ్డారు. "కెనడాలో ఖలిస్థానీ తీవ్రవాదం ఎంత హింసాత్మకంగా, సిగ్గులేనిదిగా మారింది"అని కామెంట్ చేస్తూ దాడికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  


ఖలిస్తాన్‌ దాడుల వీడియోలు షేర్ చేసిన ఎంపీ


ఆలయం ముందు ఖలిస్తాన్ జెండాలు ఊపుతున్న వారి వీడియోను ఆర్య షేర్ చేశారు. "ఈరోజు కెనడియన్ ఖలిస్తానీ తీవ్రవాదులు రెడ్ లైన్‌ను దాటారు. బ్రాంప్టన్‌లోని హిందూ సభా ఆలయ ప్రాంగణంలో హిందూ-కెనడియన్ భక్తులపై ఖలిస్తానీలు జరిపిన దాడి కెనడాలో ఖలిస్తానీ హింసాత్మక తీవ్రవాదం ఎంత దారుణంగా ఉందో చూపిస్తుంది. కెనడియన్ రాజకీయ యంత్రాంగానికి తోడు ఖలిస్తానీలు వారి చట్టాన్ని అమలు చేస్తున్నారు. అలాంటి  ఏజెన్సీల్లోకి వాళ్చొలు రబడ్డారనే నివేదికల్లో కొంత నిజం ఉందని భావిస్తున్నాను" అని ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో రాశారు.


Also Read: ఇజ్రాయెల్‌కు కొత్త ప్రత్యర్థి, డ్రోన్లతో వరుసగా దాడులు!


హక్కులను దుర్వినియోగం చేస్తున్న ఖలిస్తానీలు


కెనడాలోని భావప్రకటనా స్వేచ్ఛ చట్టాలను ఖలిస్తానీ తీవ్రవాదులు దుర్వినియోగం చేసుకుంటున్నారని కెనడా పార్లమెంటు సభ్యుడు ఆందోళన వ్యక్తం చేస్తూ, " భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ' కింద ఖలిస్థానీ తీవ్రవాదులు కెనడాలో రెచ్చిపోతుండటంలో ఆశ్చర్యం లేదు." అని అన్నారు. 




హిందూ సమాజానికి ప్రత్యేక విజ్ఞప్తి 
ఆర్య ఇంకా మాట్లాడుతూ... నేను చాలా కాలంగా చెబుతున్నట్లుగా, హిందూ-కెనడియన్లు తమ కమ్యూనిటీ భద్రతను కాపాడటానికి ముందుకు రావాలి. వారి హక్కుల విషయంలో రాజకీయ నాయకులను జవాబుదారీగా ఉండాలి." అని అన్నారు. కెనడాలో దేవాలయాలపై ఇంతకు ముందు కూడా చాలాసార్లు దాడులు జరిగాయి. గతంలో కెనడాలోని హిందూ దేవాలయాలపై జరిగిన దాడులను ఆర్య గుర్తు చేశారు. "ఎడ్మంటన్‌లోని హిందూ దేవాలయం BAPS స్వామినారాయణ్ మందిర్ ధ్వంసం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా, గ్రేటర్ టొరంటో ఏరియా, బ్రిటిష్ కొలంబియా, కెనడాలోని ఇతర ప్రదేశాల్లో హిందూ దేవాలయాలు ద్వేషపూరితంగా ధ్వంసం చేస్తున్నారు." " గత సంవత్సరం, విండ్సర్‌లో ఒక హిందూ దేవాలయం ధ్వంసమైంది. గతంలో మిస్సిసాగా, బ్రాంప్టన్‌లలో జరిగిన ఘటనల్లో దేవాలయాలను టార్గెట్ చేసుకున్నారు. దీనికి కెనడాలోని భారతీయ సమాజం నుంచి తీవ్ర స్పందన వచ్చింది.


Also Read: చిన్నప్పుడు ప్రతి దీపావళికి భారత్‌కు వచ్చి బంధువులతో సరదాగా గడిపేవాళ్లం - కమలా హ్యారిస్