ఇజ్రాయెల్‌కు కొత్త ప్రత్యర్థి, డ్రోన్లతో వరుసగా దాడులు!

మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్‌కు కొత్త ప్రత్యర్థి తయారైంది. Israeli Defence Force కి ఇప్పుడు ఇరాక్ లోని Islamic Resistance in Iraq అనే ఒక గ్రూప్ కొత్త తలనొప్పిగా తయారైంది. నార్త్ ఇజ్రాయెల్‌కు డ్రోన్స్ పంపి పేలుళ్లకు పాల్పడినట్లుగా ఈ Islamic Resistance in Iraq క్లెయిమ్ చేసుకున్నట్లుగా వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. ఇరాన్-మద్దతుగల ఇస్లామిక్ రెసిస్టెన్స్.. నార్త్ ఇజ్రాయెల్‌లో కీలకమైన లక్ష్యాలను తాకినట్లు ప్రకటనలో వెల్లడించింది. అయితే, ఈ గ్రూప్ చేసిన డ్రోన్స్ దాడి చర్య కారణంగా ఇజ్రాయెల్‌లో ఎంత నష్టం సంభించిందనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు. ముఖ్యంగా, తాము సౌత్ ఇజ్రాయెల్‌లో కూడా డ్రోన్ దాడిని నిర్వహించినట్లు ఇస్లామిక్ రెసిస్టెన్స్ గ్రూపు క్లెయిమ్ చేసుకుంది. ముందు అక్టోబర్ 03న సౌత్ ఇజ్రాయెల్‌లో డ్రోన్ దాడి చేసిన తర్వాత తాజాగా నార్త్ ఇజ్రాయెల్ లో దాడులు జరిగాయి. ఈ దాడులను ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ అప్పుడే దీటుగా ఎదుర్కొన్నట్లుగా ఆ దేశ సైన్యం ప్రకటించింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola