The village where sun never rises in Norway: ప్రపంచంలో అన్ని దేశాల్లో సూర్యుడు కనిపిస్తాడు. కొన్ని దేశాల్లో ఎక్కువ సేపు.. కొన్ని దేశాల్లో తక్కువ సేపు కనిపించవచ్చు. ఎందుకంటే ఖగోళశాస్త్రం ప్రకారం.. భూమి తన తుట్టూ తాను తిరుగుతూ గుండ్రంగా తిరుగుతుంది. ఈ క్రమంలో ఆక్షాంశ, రేఖాంశాల కారణంగా సూర్యుడి కనిపించే సమయం దేశాలకు తగ్గట్లుగా మారుతుంది. కానీ అసలు సూర్యుడే దాదాపుగా కనిపించని ఊళ్లు ఉన్నాయని తెలుసా ?
Also Read: అమెరికాలో భారత విద్యార్థులకు పార్ట్‌టైమ్ జాబ్స్ కష్టమే - బేబీ సిట్టర్స్‌గా మారిపోతున్నారు !
అంటార్కిటా ఖండంలో ఓ దేశం నార్వే. అంటార్కిటికా అంటేనే అత్యంత చలి ప్రాంతం అని మనకు తెలుసు. ఈ నార్వే మరీ చలి ప్రాంతం అనుకోవచ్చు. అలాగే నార్వేలో మరుమూల పల్లెల గురించి చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి ఓ సిటీ లాంగ్వియర్ బైన్. ఇది సిటీనో గ్రామమో చెప్పలేం కానీ.. ఇక్కడ ఉండే దాదాపుగా రెండు వేల మంది ప్రజలు సూర్యుడ్ని చూడటం అరుదు. ఎంత అరుదు అంటే.. సంవత్సరానికి ఒకటి రెండు సార్లు చూస్తే చాలు. మరి వెలుతురు ఎలా అనుకుంటారా.. అలాంటి ఆశ వారేం పెట్టుకోరు. ఎప్పుడూ లైట్ల వెలుతురులోనే ఉంటారు.
లాంగ్వియర్ బైన్ గ్రామంలో సూర్యుడు ఎందుకు కనిపించడు ఉంటే.. మొత్తం శీతాకాలమే ఉంటుంది. మంచు కొండల్లోనే అ గ్రామం ఉంటుంది. ఆర్కిటిక్ వలయానికి ఊరు ఉన్న దూరాన్ని బట్టి ఆ ప్రదేశాల్లో ఏర్పడే రాత్రుల్లో తేడా ఉంటుంది. సుదీర్ఘంగా సాగే ఈ రాత్రులు నెలలపాటు ఉంటాయి. మంచు కొండల మధ్య పొందికగా పేర్చినట్టుండే ఈ ఊళ్లో ఏప్రిల్‌లో మాత్రమే ఓ సారి సూర్యుడు కనిపిస్తాడు. తర్వాత మళ్లీ కనిపించడం అసాధ్యం. ముఖ్యంగా నవంబర్ మధ్యకాలం నుంచి దాదాపు రెండున్నర నెలలు ఈ ప్రాంతంలో చిమ్మచీకటి కమ్ముకుని ఉంటుంది. ఇప్పుడు అదే పరిస్థితి.
అయనోస్పియర్‌లో సౌరవాయువులకు చెందిన అయాన్లు భూ వాతావరణంలోని ఆక్సిజన్, నైట్రోజన్ అణువులను ఢీకొట్టిన కారణంగా ఆ ప్రాంతంలో రంగురంగుల్లో దర్శనమిచ్చే అరోరా బొరియాలిస్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ గ్రామంలో రెండు వేల మంది ఉంటారు. ఇక్కడ పరిస్థితులు ఇలా ఉంటాయని జనం కష్టాలతో బతికేస్తూంటారని అనుకోవాల్సిన పని లేదు. ఆ ఊళ్లో సూపర్ మార్కెట్స్, బార్, చర్చి, సినిమా హాల్, స్కూల్ , మున్సిప్లల్ స్విమ్మింగ్ ఫూల్ కూడా ఉంది. పోలార్ నైట్స్ ఉన్న విలేజీగా దీనికి పెద్ద పేరు ఉంది. ఎందుకంటే ఇక్కడికి టూరిస్టులు కూడా బాగానే వస్తారు మరి.