Gun Violence In USA: అమెరికాలో రెండురోజుల్లో మరో రెండు కాల్పుల ఘటనలు జరగడం కలకలం సృష్టించింది. న్యూయార్క్‌లో జరిగిన మారణహోమం మరువకముందే మళ్లీ కాల్పుల మోత మోగింది.
దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ చర్చిలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడి వద్ద నుంచి తుపాకిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
మరో ఘటన
హ్యుస్టన్ మార్కెట్‌లో ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బహిరంగ మార్కెట్‌లో కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణ వాతావరణమే కాల్పులకు దారి తీసినట్లు పేర్కొన్నారు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
మారణహోమం
అమెరికాలో 18 ఏండ్ల శ్వేత జాతి యువకుడు నల్లజాతీయులపై ఆదివారం విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనను నిందితుడు లైవ్ స్ట్రీమింగ్ చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. న్యూయార్క్‌లోని బఫెలో ప్రాంతంలోని ఓ సూపర్ మార్కెట్‌లో ఈ దారుణం జరిగింది.
ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు అధ్యక్షుడు జో బైడెన్. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని ఎఫ్‌బీఐ అధికారులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. నల్లజాతీయులు అధికంగా ఉన్న చోట ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. కాల్పుల ఘటనకు జాతివిద్వేషమే కారణంగా భావిస్తున్నామన్నారు.
Also Read: Viral Video: మహిళా లాయర్‌ను తంతూ, జుట్టు లాగుతూ రోడ్డుపై దాడి- షాకింగ్ వీడియో
Also Read: PM Modi in Nepal: నేపాల్ పర్యనటలో మోదీ- ప్రముఖ బౌద్ధ క్షేత్రం సందర్శన