Europa Clipper: గురు గ్రహానికి ఉపగ్రహమైన 'యూరోపా' గురించి పరిశోధన కోసం నాసా ఓ ప్రాజెక్టు చేపట్టిన విషయం తెలిసిందే. యూరోపా క్లిప్పర్ ప్రాజెక్టు పేరుతో ఈ ప్రయోగం చేపట్టనుంది. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ హెవీ రాకెట్‌ పై 2024లో క్లిప్పర్ యూరోపా ఉపగ్రహం చుట్టూ చక్కర్లు కొట్టనుంది. సముద్రాలతో నిండిన ఆ ఉపగ్రహంపై జీవం ఉందో లేదో తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది.


ఈ మెగా ప్రయోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తాజాగా నాసా ఓ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. 'సెండ్ యువర్ నేమ్ టు యూరోపా' పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది. 'ఇన్ ప్రైజ్ ఆఫ్ మిస్టరీ: ఎ పోయెమ్ ఫర్ యూరోపా' అనే అమెరికా కవి అడా లిమోన్ రాసిన కవితతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహికులు పంపించే పేర్లను గురు గ్రహంపైకి పంపించనుంది నాసా. 


యూరోపా కవితతో పాటు అందరి పేర్లు టాంటాలమ్ మెటల్ ప్లేట్లపై చెక్కి దానిని యూరోపా క్లిప్పర్ రాకెట్ లో ఉంచనున్నారు. అలాగే ఈ ప్లేట్లపై మైక్రోచిప్‌లనూ ఉంచుతారు. ఈ గురుగ్రహ ఉపగ్రహమైన యూరోపా భూమి నుండి 2.6 బిలియన్ కిలోమీటర్ల దూరం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 


పేర్లు ఎలా పంపాలంటే..


మొదట http://go.nasa.gov/MessageInABottle ను క్లిక్ చేసి ఆ లింక్ లోకి వెళ్లి పేర్లు నమోదు చేసుకోవాలి. డిసెంబర్ 31వ తేదీ 2023 లోపు పేర్లు పంపాల్సి ఉంటుంది.  


యూరోపా క్లిప్పర్ మిషన్


ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ హెవీ రాకెట్‌ ద్వారా ఈ ప్రయోగం చేపట్టనుంది నాసా. 2024లో ఈ ప్రయోగం చేపట్టనున్నారు. గురు గ్రహం ఉపగ్రహమైన యూరోపా సముద్రాలతో నిండి ఉంటుంది. ఆ ఉపగ్రహంపై జీవం ఉందో లేదో తెలుసుకోవడమే లక్ష్యం. భూమి నుండి ఈ ఉపగ్రహం 2.6 బిలియన్ కిలోమీటర్ల దూరం ఉంటుంది. 2024లో ప్రయోగం చేపడితే అన్నీ సవ్యంగా జరిగితే 2030 నాటికి  క్లిప్పర్ రాకెట్ యూరోపా గ్రహం వద్దకు చేరుకుంటుంది. ఈ రాకెట్ యూరోపా చుట్టూ దాదాపు 50 సార్లు తిరుగుతుంది. 


క్లిప్పర్ కంటే ముందు జ్యూస్


క్లిప్పర్ కంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 2023 ఏప్రిల్ లో జూపిటర్ ఐసీమూన్ ఎక్స్‌ప్లోరర్ లేదా జ్యూస్ పేరుతో ఓ పరిశోధక నౌకను యూరోపా పైకి ప్రయోగించింది. భవిష్యత్తులో అణుశక్తితో నడిచే జలాంతర్గాములను యూరోపాలోని సముద్రాల్లో ప్రయాణించేలా చేసి ఆ ఉపగ్రహం గురించి మరింత క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు ఈ ప్రయోగం చేపట్టారు.


భూమి-యూరోపా మధ్య సారూప్యతలు


భూమి..
* వ్యాసం: 12,742 కిలోమీటర్లు
* సముద్రపు లోతు (సగటున): 4 కిలోమీటర్లు
* ఎంత నీరు: 140 కోట్ల ఘనపు కిలోమీటర్లు
* భూ ఉపరితలంపై 29 శాతం నేల, 71 శాతం నీరు
* ఉప్పునీటితో కూడిన సముద్రాలు
* రాతితో కూడిన అడుగుభాగం


యూరోపా..
* వ్యాసం: 3,120 కిలోమీటర్లు
* సముద్రపు లోతు: 100కిలోమీటర్లు
* ఎంత నీరు: 300 కోట్ల ఘనపు కిలోమీటర్లు
* యూరోపైప నేల దాదాపు శూన్యం. మూడు నుంచి 30 కిలోమీటర్ల మందమైన మంచు పలకలతో కప్పబడి ఉంటుంది.
* ఉప్పునీటి మహా సముద్రాలు
* రాతితో కూడిన అడుగుభాగం