Employee dies after manager denies sick leave : పని ప్రదేశాల్లో గడ్డు పరిస్థితులు ఉండటం ప్రపంచం అంతటా ఉంటుంది. అది ఉత్పాదక పరిశ్రమనా... లేకపోతే సేవల కంపెనీనా అన్నది తర్వాత విషయం. కానీ ఒత్తిడి.. వేధింపులు ఎక్కడైనా ఒక్కటే. ఇటీవల బారత్ లో ఎర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీకి చెందిన ఓ ఓద్యోగిని పని ఒత్తిడి తట్టుకోలేకపోయిన ఘటనపై ఇప్పటికీ దేశవ్యాప్తంగా కార్పొరేట్ సర్కిల్స్ లో చర్చ జరుగు తోంది. ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది. అయితే అది ఇండియా లో కాద ధాయ్ ల్యాండ్‌లో.
థాయ్‌ల్యాండ్‌లో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు చాలా ఉంటాయి. వాటిలో ఉద్యోగులు కఠినమైన పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తూ ఉంటారు. ఇలా డెల్టా ఎలక్ట్రానిక్స్ అనే భారీ కంపెనీలో వేల మంది ఉపాధి పొందుతూ ఉంటారు. తాజాగా ఓ మహిళా ఉద్యోగిని ఉద్యోగం చేస్తూ కూర్చున్న చోటనే చనిపోయింది. అంతకు ముందు ఆమె తనకు ఆరోగ్యం బాగో లేదని సెలువు ఇవ్వాలని మేనేజర్ ను కోరింది. కానీ మేనేజర్ మాత్రం ఆమె నిజం చెప్పడం లేదని భావించి ఆ సెలవును రిజెక్ట్ చేశాడు. దాంతో ఆమె తప్పనిసరిగా విధులకు హాజరయింది. ఆరోగ్యం బాగోలేకపోవడంతో పాటు పని ఒత్తిడి పెరిగిపోవడంతో ఆమె ఉన్న చోటనే కుప్పకూలిపోయారు.
ఉద్యోగిని మృతి అంశం థాయ్ ల్యాండ్‌లో కలకలం రేపింది. ఈ అంశంపై అక్కడ విస్తృతంగా చర్చ జరగడంతో డెల్టా ఎలక్ట్రానిక్స్ కంపెనీ సీఈవో ఓ ప్రకటన చేశారు. ఉద్యోగిని మృతితో తాము కలత చెందామని.. ఏం జరిగిందో విచారణ చేస్తామని తెలిపారు. ఉద్యోగిని కుటుంబానికి సాయం చేస్తామన్నారు. ఈ ఘటన తర్వాత అన్ని పరిశ్రమల్లోనూ పని పరిస్థితులపై విస్తృత పరిశీలన చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ఆ దిశగా తాము స్వచ్చందంగా పరిశీలన చేసుకుంటామని డెల్టా లాంటి కంపెనీలు ప్రకటించాయి .
రోజువారీ కూలీ వెయ్యి రూపాయలు పైనే..! అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తున్న కొత్త చట్టం!
ఇటీవల ఇండియాలో మరణించిన ఈవై కంపెనీ ఉద్యోగిని అన్నా సెబాస్టియన్ అంశంపై కూడా ఇలాగే చర్చ జరిగింది. మల్టినేషనల్ కంపెనీలు.. తమ కార్యాలయాల్లో పని పిరిస్థితులపై అధ్యయనం చేస్తామని ఒత్తిళ్లు లేకుండా ఉండేలా చూసుకుంటామని ప్రకటించింది. ఇప్పుడు ఇలాంటి మరణాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమలు, ఫ్యాక్టరీలు.. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది.