Google pays 2.7 billion Dollars to rehire AI pioneer : నోవామ్ షజీర్ అనే ఉద్యోగి తన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ బాట్ ఐడియాను కొద్ది రోజుల కిందట తన టీమ్ లీడర్ కు వివరించారు. అది ఆయనకు అర్థం కాలేదు. బాసిజం చూపించాడు. చెత్తగా ఉంది తీసి పక్కన పెట్టేయమన్నాడు. దీంతో నోవామ్ షజీర్ కు మండిపోయింది. ఆయన ఇమ్మీడియట్‌గా రిజైన్ చేశారు. కంపెనీ కూడా ఎందుకు రిజైన్ చేశారు అని ఆరా తీయకుండా ఆయన రిజైన్ లెటర్‌కు ఆమోద ముద్ర వేసింది. అలా నోవామ్ షజీర్ మాజీ ఉద్యోగి అయ్యారు.
ఇప్పుడు అదే నోవామ్ షజీర్ గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రాజెక్ట్ జెమినీని లీడ్ చేస్తున్నారు. అప్పుడు పట్టించుకోని గూగుల్ ఇప్పుడు ఆయనకు అంత భారీ ప్రాజెక్టును డిజైన్ చేసే బాధ్యతను ఎందుకు ఇచ్చింది ?. ఇచ్చిన షజీర్ ఎందుకు తీసుకున్నాడు ?. అనే డౌట్ రావొచ్చు. కానీ మానేయడానికి.. మళ్లీ గూగుల్‌లో చేరడానికి మధ్య చాలా జరిగింది. అందులో ప్రధానమైనది తిరస్కరించలేనంత ఆఫర్.
షజీల్ గూగుల్ కు రిజైన్ చేసిన తర్వాత తన సొంత ఆలోచనలతో క్యారెక్టర్.ఏఐ అనే స్టార్టప్ ప్రారంభించారు. 2021లో ఈ స్టార్టప్‌ను ప్రారంభించాడు. ఇది ఎంత సక్సెస్ అయిందంటే.. గూగుల్‌కు కూడా ముప్పు వచ్చేస్తుందేమో అన్నంతగా సక్సెస్ అయింది. ఆలస్యం చేయకుండా గూగుల్ రంగంలోకి దిగింది. తమ ఏఐ ప్రాజెక్టు జెమినీని లీడ్ చేయాలని ఆఫర్ ఇచ్చింది. అంత ఆషామాషీగా షజీర్ ఎందుకు అంగీకరిస్తాడు.. అందుకే తిరస్కరించలేనంత ఇచ్చారు. అది 2.7 బిలియన్ డాలర్ల మొత్తం. అంటే మన రూపాయల్లో 22 వేల 558 కోట్ల రూపాయలు. అంత కంటే కావాల్సిందేముందని తన కంపెనీతో సహా గూగుల్ లో చేరిపోయాడు.
ముందుగానే గూగుల్ లో పని చేస్తున్నప్పుడే అతని ఐడియాకు గూగుల్ ఓకే అని ఉంటే.. ఇంత వరకూ పే చేయాల్సి వచ్చేది కాదు. కానీ కాస్త ఆలస్యంగానైనా జరిగిన నష్టాన్ని గుర్తించారు కాబట్టి సెట్ అయిందని గుగుల్ అనుకుంటోంది. గతంలో గూగుల్ ఇలాగే.. యూట్యూబ్ ను కొనుగోలు చేసి సక్సెస్ అయింది. ఇప్పుడు క్యారెక్టర్.ఏఐని కలిపేసుకుంది.
ఈ గూగుల్ ఉద్యోగి కథ.. లింక్డ్ ఇన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. పొటెన్షియల్ ఉన్న ఉద్యోగికి ఆకాశమే హద్దు అని షజీర్ నిరూపించారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.