Samsung Galaxy M15 5G Prime Edition: రూ.10 వేలలోపే శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ - ఇది అమెజాన్ ప్రైమ్ స్పెషల్ బాసూ!

Samsung New Phone Launched: శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ప్రైమ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ మనదేశంలో ఇటీవలూ లాంచ్ చేసింది. దీని ధర రూ.10,999 నుంచి ప్రారంభం కానుంది.

Continues below advertisement

Samsung Galaxy M15 5G Prime Edition Launched: శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ప్రైమ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ ఫోన్‌ ఆక్టా కోర్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్‌పై పని చేయనుంది. ఈ ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్‌ అందుబాటులో ఉంది. వీటిలో 50 మెగాపిక్సెల్ సెన్సార్‌ను ప్రధాన కెమెరాగా అందించారు. మూడు కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. వాటర్ డ్రాప్ తరహా డిస్‌ప్లే డిజైన్‌ను శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ప్రైమ్ ఎడిషన్ అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.

Continues below advertisement

శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ప్రైమ్ ఎడిషన్ ధర (Samsung Galaxy M15 5G Prime Edition Price in India)
ఈ స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.10,999గా ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999గానూ, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999గానూ నిర్ణయించారు. స్టోన్ గ్రే, సెలెస్టియల్ బ్లూ, బ్లూ టోపెజ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో మాత్రమే ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించిన సేల్ కూడా ఇప్పటికే ప్రారంభం అయింది.

Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే

శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ప్రైమ్ ఎడిషన్ స్పెసిఫికేషన్లు (Samsung Galaxy M15 5G Prime Edition Specifications)
ఈ డ్యూయల్ నానో సిమ్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత వన్ యూఐ 6.0 ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది. ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, దీంతోపాటు 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, విజన్ బూస్టర్ ఫీచర్లు కూడా ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్‌పై శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ప్రైమ్ ఎడిషన్ రన్ కానుంది. 8 జీబీ వరకు  ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 5 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న మరో రెండు సెన్సార్లు కూడా శాంసంగ్ అందించింది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

క్యూజెడ్ఎస్ఎస్, వైఫై, బ్లూటూత్ వీ5.3, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, 5జీ, జీపీఎస్, గ్లోనాస్, బైదు, గెలీలియో, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, గైరో సెన్సార్, జియోమ్యాగ్నటిక్ సెన్సార్, లైట్ సెన్సార్, వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సార్లను కూడా శాంసంగ్ అందించారు. ఆథెంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఫోన్ పక్కభాగంలో చూడవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ప్రైమ్ ఎడిషన్ బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ పెడితే 128 గంటల ఆడియో ప్లేబ్యాక్, 22 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను ఈ స్మార్ట్ ఫోన్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ప్రైమ్ ఎడిషన్ మందం 0.93 సెంటీమీటర్లు కాగా, బరువు 217 గ్రాములుగా ఉంది.

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

Continues below advertisement
Sponsored Links by Taboola