Best Bikes With LED Headlights: రాత్రివేళ ప్రయాణాలు చేసేటప్పుడు మంచి హెడ్ లైట్ ఉండటం అనేది తప్పనిసరి. ప్రస్తుతం ఎల్ఈడీ హెడ్ లైట్లు ట్రెండ్. నైట్ ట్రావెలింగ్‌లో ఇవి మనకు ఎక్కువ దూరం కనిపించేలా ఉపయోగపడతాయి. మనదేశంలో బడ్జెట్ ధరలో రూ.లక్ష లోపు ఉండే బైక్స్‌కు మంచి డిమాండ్ ఉంది. ఇవి ప్రభావవంతమైన ఇంజిన్లతో వస్తాయి. వీటి మైలేజీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక లీటర్ పెట్రోల్‌తో వీటిపై ఎంతో దూరం ప్రయాణించగలం. ఇవి వాల్యూ ఫర్ మనీ బైక్స్ కూడా. కానీ రూ.లక్ష లోపు ధరలో ఉన్న అన్ని బైక్స్‌లో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ ఉండవు. ఇప్పుడు రూ.లక్షలోపు ఉన్న ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ ఫీచర్ ఉన్న బెస్ట్ బైక్స్‌ ఏవో చూద్దాం.


1. హోండా ఎస్పీ 125 (Honda SP 125)
దీని ఎక్స్ షోరూం ధర రూ.86,467గా ఉంది. ఇందులో పూర్తిస్థాయి ఫుల్ ఎల్సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ కూడా అందించారు. రియల్ టైమ్ మైలేజీ ఇండికేటర్, డిస్టెన్స్ టు ఎంప్టీ రోడ్ అవుట్, డ్యూయల్ ట్రిప్ మీటర్, ఆడో మీటర్, స్పీడో మీటర్, ఫ్యూయల్ గాజ్, క్లాక్, గేర్ పొజిషన్ వీటన్నిటినీ ఆ కస్టర్‌లో చూడవచ్చు. దీంతో ఫుల్ ఎల్ఈడీ హెడ్‌లైట్, ఇంజిన్ సైలెంట్‌గా స్టార్ట్ చేయడానికి సైలెంట్ స్టార్టర్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కిల్ (సైడ్ స్టాండ్ వేయగానే ఇంజిన్ ఆగిపోవడం) వంటి ఫీచర్లు ఉన్నాయి.


2. హీరో ప్యాషన్ ఎక్స్‌టెక్ (Hero Passion XTEC)
హీరో ప్యాషన్ ఎక్స్‌టెక్ ధర రూ.82,488 (ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభం కానుంది. ఇందులో ఫ్రెష్ డిజైన్, మెరుగైన లైటింగ్ కోసం కొత్త ఎల్ఈడీ హెడ్‌లైట్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందులో 113.2 సీసీ బీఎస్6 ఇంజిన్ అందించారు. ఇది 9 బీహెచ్‌పీ పవర్, 9.7 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేయనుంది. మెరుగైన హెడ్ లైట్ ద్వారా రోడ్డును మరింత క్లియర్‌గా చూడవచ్చు. బీమ్ రేంజ్ కూడా పెరగనుంది.


Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే


3. హీరో గ్లామర్ ఎక్స్‌టెక్ (Hero Glamour XTEC)
హీరో గ్లామర్ ఎక్స్‌టెక్ ధర రూ.88,998 (ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభం కానుంది. ఇందులో ఎన్నో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. టర్న్ బై టర్న్ నావిగేషన్ అసిస్ట్ ఉన్న ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంతో పాటు సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్, బ్యాంక్ యాంగిల్ సెన్సార్ వంటి ఫీచర్లు కూడా అందించారు. ఇవి యూజర్ సేఫ్టీకి ఉపయోగపడనున్నాయి.


4. ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ (OLA Roadster X)
దీని ధర రూ.74,999 నుంచి ప్రారంభం కానుంది. ఇది ఎక్స్ షోరూం రేటు. సింపుల్, ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో ఈ బైక్ మార్కెట్లోకి వచ్చింది. అడ్డంగా ఉన్న ఎల్ఈడీ హెడ్‌లైట్ దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ పెడితే ఇది 117 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. దీని టాప్ స్పీడ్ 105 కిలోమీటర్లుగా ఉంది. 11 కేడబ్ల్యూ మ్యాగ్జిమం పవర్ అవుట్‌పుట్‌ను ఇది డెలివర్ చేయనుంది.


5. టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ (TVS Star City Plus)
టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ రూ.75,000 ఎక్స్ షోరూం ధరతో మార్కెట్లోకి వచ్చింది. ఇందులో ఎన్నో మంచి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. దీని ఫుల్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ బండికి కొత్త స్టైల్‌ను అందించనుంది. 109.7 సీసీ ఇంజిన్ మంచి మైలేజీని కూడా ఇస్తుంది. ఏకంగా 67 కిలోమీటర్ల మైలేజీని ఈ బండి అందిస్తుందని కంపెనీ అంటోంది. కాబట్టి రూ.లక్షలోపు ధరలో ఇది కూడా మంచి ఛాయిస్.



Also Read: బైక్స్‌ కంటే ఎక్కువ మైలేజీ ఇచ్చే సీఎన్‌జీ కార్లు- రోజువారి పనుల కోసం ది బెస్ట్‌!