Prakash Raj: పవన్ కల్యాణ్ ని వెంటాడుతున్న ప్రకాష్ రాజ్.. జస్ట్ ఆస్కింగ్ అంటూ మరో ఘాటు ట్వీట్

Prakash Raj : ఈరోజు మళ్లీ పవన్ ని టార్గెట్ చేస్తూ ట్వీట్ వేశారు ప్రకాష్ రాజ్. గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం అంటూ పొయెటిక్ గా ఓ స్టేట్ మెంట్ ని ట్విట్టర్లో పెట్టారు.

Continues below advertisement

Prakash Raj Vs Pawan Kalyan: నువ్వు నంద అయితే నేను బద్రి, బద్రీనాథ్ అనేది సినిమా డైలాగ్.. నువ్వు డిప్యూటీ సీఎం అయితే నేను ప్రకాష్, ప్రకాష్ రాజ్.. ఇది రియల్ లైఫ్ డైలాగ్. 

Continues below advertisement

తిరుమల లడ్డూ వివాదం పవన్ కల్యాణ్(Pawan kalyan), ప్రకాష్ రాజ్(Prakash raj) వీరిద్దరి మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఈ పోరులో ప్రకాష్ రాజ్ ఎక్కడా తగ్గేలా లేరు. మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ని ఉద్దేశిస్తూ ఘాటు ట్వీట్ వేశారు. 

"గెలిచేముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం..ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ  అయోమయం..  ఏది నిజం..?  జస్ట్‌ ఆస్కింగ్‌?" అంటూ ట్వీట్ వేశారు ప్రకాష్ రాజ్. తనదైన శైలిలో  #justaskingవ అనే హ్యాష్ ట్యాగ్ కూడా జతచేశారు. 

తిరుమల లడ్డూ(Tirumala Laddu) వివాదంపై పవన్ కల్యాణ్ వేసిన ట్వీట్ తో ఈ గొడవ మొదలైంది. ఆ ట్వీట్ కి ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. మీరు డిప్యూటీసీఎంగా ఉన్న రాష్ట్రంలోనే ఈ గొడవ జరిగింది. దీనిపై మీరు ఇన్వెస్టిగేషన్ చేయించండి. ఇప్పటికే దేశంలో మతపరమైన టెన్షన్లు చాలానే ఉన్నాయంటూ బదులిచ్చారు. ఆ తర్వాత నటుడు మంచు విష్ణు రియాక్ట్ కావడంతో ఓకే శివయ్యా.. అంటూ ఆయనకు కూడా ఓ సెటైరిక్ ఆన్సర్ ఇచ్చాడు ప్రకాష్ రాజ్. లడ్డూ వ్యవహారంపై ఓ వివాదాస్పద కార్టూన్ ని కూడా ప్రకాష్ రాజ్ పోస్ట్ చేశారు. 

ఇటీవల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్ నటుడు ప్రకాష్ రాజ్ తోపాటు మరో నటుడు కార్తీకి కూడా తిరుమల లడ్డూ వ్యవహారంపై జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికారు. దీనికి కౌంటర్ గా ప్రకాష్ రాజ్ ఓ వీడియోని పోస్ట్ చేశారు. తన మాటల్ని పవన్ తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. విదేశాల్లో షూటింగ్ లో ఉన్నానని, ఇక్కడికి వచ్చాక అన్నిటికీ సమాధానమిస్తానని చెప్పారు ప్రకాష్ రాజ్. ఇటు హీరో కార్తి మాత్రం పవన్ కల్యాణ్ కి వెంటనే సారీ చెప్పారు. కార్తీ సారీ చెప్పడాన్ని పవన్ స్వాగతించారు. అయితే కార్తితో అకారణంగా సారీ చెప్పించుకున్నారంటూ ప్రకాష్ రాజ్ మళ్లీ ఈ గొడవలోకి ఎంటర్ అయ్యారు. 
"చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్..." అని ట్వీట్ వేశారు. 

అక్కడితో ఆ గొడవ ఆగిపోయిందని అనుకున్నా.. మళ్లీ ఈరోజు పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేస్తూ ట్వీట్ వేశారు ప్రకాష్ రాజ్. గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. అంటూ పొయెటిక్ గా ఓ స్టేట్ మెంట్ ని ట్విట్టర్లో పెట్టారు. దీనికి పవన్ అభిమానులు గట్టిగానే సమాధానం చెబుతున్నారు. గతంలో.. పవన్ ని ప్రకాష్ రాజ్ పొగుడుతున్న వీడియోలని పోస్ట్ చేస్తున్నారు. గతంలో పవన్ ని పొగిడిన నోటితోనే ఇప్పుడు విమర్శిస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు పవన్ అభిమానులు. ఈ మాటల యుద్ధానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో వేచి చూడాలి. 

Also Read: తిరుమల లడ్డూ వివాదంలో మరో కీలక పరిణామం- ఏఆర్ సంస్థపై కేసులు

Continues below advertisement