rare alignment of 5 planets :   ఈ నెలలో ఖగోళ ప్రియులను ఆకాశంలో అద్భుత దృశ్యం కనువిందు చేయనున్నది. సౌరవ్యవస్థలోని ఐదు గ్రహాలు ఒకే సరళ రేఖపైకి రాబోతున్నాయి. ఈ ఖగోళ అద్భుతం ఈ నెల 24న ఆవిష్కృతం కానున్నది. ఈ నెలలో బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలు ఒకే వరుసలో కనిపించనున్నాయి. 





ఓ వైపు యుద్ధం, మరోవైపు వినోదం- కీవ్‌ థియేటర్‌లో షోలు హౌస్‌ఫుల్! 


అరుదైన దృశ్యాన్ని టెలిస్కోప్‌ల ద్వారా చూడొచ్చని నిపుణులుచెబుతున్నారు.  తెల్లవారు జామున ఐదుగ్రహాలు ఒకదాని తర్వాత ఒకటి కనిపించనున్నాయి. ఈ అరుదైన దృశ్యం 18 సంవత్సరాల తర్వాత కనిపించనున్నది. ఇంతకు ముందు చివరి సారిగా 2004 డిసెంబర్‌లో కనిపించింది.





 భారత్‌కు ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా వార్నింగ్- కీలక నగరాల్లో దాడులు చేస్తామని లేఖ



 ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే .... ఈ సారి బుధుడు, శనిగ్రహాల మధ్య దూరం చాలా తక్కువగా ఉండనున్నది. ఐదు గ్రహాలు సరళ రేఖలోకి రావడం చాలా అరుదని నిపుణులు చెబుతున్నారు.  


క్యాన్సర్‌ రోగులకు గుడ్‌న్యూస్ - పూర్తిగా నయం చేసే డ్రగ్‌ ట్రయల్స్ విజయవంతం



ఈ గ్రహాలు చివరిసారిగా 2004లో కనిపించాయని, మళ్లీ 2040 లోనే కనిపిస్తాయన్నారు. జూన్‌ మాసం గడిచేకొద్దీ బుధగ్రహాన్ని సులభంగా చూడొచ్చని , ఈ నెల 24న ప్రత్యేకంగా ఉంటుందని ప్రపంచవ్యాప్తంగాప్రచారం జరుగుతోంది.  అదే రోజున వీనస్, మార్స్ మధ్య చంద్రవంకను చూడొచ్చు.  సూర్యోదయానికి అరగంట ముందు ఈ ఖగోళ అద్భుతం ఆవిష్కృతమవుతుందని చెప్పారు. తూర్పు వైపు హోరిజోన్‌లో ఈ దృశ్యాన్ని బైనాక్యులర్‌ సహాయంతో చూడొచ్చ ఇప్పటికే సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది.  అయితే ఇండియాలో  ఏ స్థాయిలో కనిపిస్తుందో నిపుణులు ఇంకా వెల్లడించలేదు.