Covid 19 in North Korea: 


వరుస క్షిపణి ప్రయోగాలతో ప్రపంచాన్నే వణికించిన ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌ను కరోనా టెన్షన్ పెడుతోంది. ఇటీవల తొలి కరోనా కేసు నమోదైన ఉత్తర కొరియాలో వైరస్ ఉద్ధృతి పెరిగింది. తాజాగా బాధితుల సంఖ్య 10 లక్షలు దాటేసింది. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వ మీడియానే వెల్లడించింది. 






లక్షణాలతోనే


భారీగా టెస్టులు చేసే అవకాశం ఉత్తర కొరియాకు లేకపోవడంతో లక్షణాల ఆధారంగానే వైరస్‌ సోకిందని భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ 10 లక్షల మందికి పైగా జ్వరంతో బాధపడుతున్నారని మీడియా పేర్కొంది. ఇప్పటి వరకు 50 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. అయితే ఇందులో కరోనాతోనే మృతి చెందినవారు ఎంతమంది అనేదానిపై స్పష్టత లేదు.


భారీగా 


ఉత్తర కొరియాలో ప్రస్తుత పరిస్థితులు కేవలం శాంపిల్ అని కరోనా అక్కడ పెను ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఉత్తర కొరియాలో ఆరోగ్య వ్యవస్థ సరిగాలేకపోవడం అని పేర్కొంటున్నారు. అంతేకాకుండా పౌరులకు వ్యాక్సిన్ అందజేయడంలోనూ కిమ్ సర్కార్ ఘోరంగా విఫలమైంది.


లాక్‌డౌన్


కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కిమ్ జాతీయ స్థాయి లాక్‌డౌన్ విధించారు. ఉత్తర కొరియా సైన్యంలో మెడికల్‌ కోర్‌ను కిమ్ రంగంలోకి దింపారు. ప్యాంగ్యాంగ్‌ నగరానికి ఔషధ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు.


గతేడాది పలు దేశాలు ఉత్తరకొరియాకు ఆస్ట్రాజెనెకా, చైనా తయారీ టీకాలను ఆఫర్‌ చేశాయి. కానీ, ఉ.కొరియా మాత్రం లాక్‌ డౌన్‌, సరిహద్దుల మూసివేతతోనే వైరస్‌ను అదుపు చేస్తామని పేర్కొంది. కానీ ఇప్పుడు పరిస్థితులు చేయిదాటిపోయినట్లు కనిపిస్తున్నాయి. మరి కిమ్ జోంగ్ ఉన్ ఏం చేస్తారో చూడాలి.


Also Read: Katwa hospital: ఇదేందిరా ఇది! బిర్యానీ బిల్లు రూ.3 లక్షలా!


Also Read: Gyanvapi Masjid Case: జ్ఞానవాపి మసీదులో శివలింగం- కీలక ఆదేశాలు జారీ చేసిన కోర్టు!