Rahul Gandhi Truck Ride: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటన కొనసాగుతోంది. భారతదేశంలో లాగానే అమెరికాలోనూ రాహుల్ గాంధీ అక్కడి ప్రజలను కలుస్తున్నారు. చిరు వ్యాపారాలు, ఉద్యోగాలు చేసే వారిని పలకరించి మాట్లాడారు. ఈక్రమంలోనే ఆయన వాషింగ్టన్ నుంచి న్యూయార్క్ వరకు ఓ ట్రక్కులో ప్రాయాణం చేశారు. తల్జిందర్ సింగ్ అనే డ్రైవర్ తో కలిసి ట్రక్కులో వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ తన యూట్యూబ్ ఛానల్ లో పోస్టు చేశారు. ఈ సమయంలో పంజాబీ గాయకుడు దివంగత సిద్ధూ మూసేవాల "295" పాటను అడిగి మరీ ప్లే చేయించుకొని విన్నారు. ఈ ప్రయాణంలో రాహుల్.. అక్కడ ట్రక్కు డ్రైవర్లు ఎలా పని చేస్తారని, ట్రక్కు ఫీచర్లు ఏంటని, వారికి చలాన్లు పడతాయని అనే వేగ పరిమితి ఎంత అని అడుగారు.


ఎంతసేపు కష్టపడతారు, ఆదాయం ఎంత వస్తుంది?


అలాగే డ్రైవర్లు ఎతం ఆదాయం సంపాధిస్తారు, వంటి విషయాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అక్కడ డ్రైవర్లు నెలకు రూ.8 లక్షలు సంపాధిస్తారని తెలిసి ఆయన ఆశ్చర్యపోయారు. బీజేపీ హయాంలో విద్వేషాలను వ్యాప్తి చేస్తున్నారని సదరు డ్రైవర్ చెబుతున్నప్పుడు రాహుల్.. ఆయన చెప్పినవన్నీ విన్నారు. అనంతరం డ్రైవర్ తల్జిందర్ ఏదైనా పట వినిపించినా అని అడిగిప్పుడు... ఏదైనా సరే అని రాహుల్ చెప్పారు. ఈక్రమంలోనే ట్రక్కు డ్రైవర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సిద్ధూ మూసేవాల పాట ప్లే చేయమంటారా అని అడగ్గా.. రాహుల్ అంగీకరించిన 295 సాంగ్ ను ప్లే చేయమని కోరారు. అనంతరం కొద్ది సేపటికి వారి వాహనం ఓ రెస్టారెంట్ వద్ద ఆగగా.. రాహుల్ అందులోకి వెళ్లి అక్కడి వారిని పలకరించారు. అందరితో కలిసి ఫొటోలు దిగారు. అనంతరం కొంచెం ఆహారం తిని ట్రక్కు డ్రైవర్ కు వీడ్కోలు పలికారు.






రాహుల్ గాంధీ ఈ వీడియోను షేర్ చేసిన కేవలం రెండు గంటల్లోనే 1.84 లక్షల మంది వీక్షించగా... 30 వేల మంది లైక్ చేశారు. గత నెలలో దిల్లీ నుంచి చండీగఢ్ వెళ్తున్న రాహుల్.. మార్గ మధ్యంలో కారు దిగి, ఓ ట్రక్కు ఎక్కి ప్రయాణించారు. అనుకోని అతిథి రాకతో.. ఆ డ్రైవర్లు అంతా ఒక్క సారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. లారీలో డ్రైవర్ పక్కన కూర్చోవడం.. ఓ దాబా వద్ద డ్రైవర్లతో మాటా మంతీ తదితర దృశ్యాలను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. మరోవైపు ప్రయాణంలో భాగంగా రాహుల్ గాంధీ.. అంబాలా - చండీగఢ్ జాతీయ రహదారి వెంబడి అంబాలా నగరంలోని గురుద్వారాను సందర్శించారు.