China News :   చైనా జనాభాలో వృద్ధుల శాతం పెరిగిపోతోంది. కొత్త జననాలు తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో చైనా ముందు ముందు తీవ్ర సంక్షోభంలో పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. పిల్లల్ని కనమని ఎంత ప్రోత్సహిస్తున్నా యువత మాత్రం.. అసలు పెళ్లిళ్లు చేసుకోవడానికే ఆసక్తి చూపించడం లేదు.  జనాభా పెరుగుదలలో తగ్గుదల, నానాటికీ జననాల సంఖ్య తగ్గి పోవడం వంటి వాటితో సతమతమవుతున్న చైనా ఒక్కసారి ఉలిక్కిపడింది. పెళ్లిళ్లు చేసుకునే యువత సంఖ్య దారుణంగా పడిపోయింది.       


సిబ్బంది దెబ్బకు మార్క్‌ జుకర్‌బర్గ్‌ మైండ్‌ బ్లాంక్‌, ఈ కష్టం ఏ బాస్‌కు రాకూడదు           


1986 తర్వాత ఎన్నడూ లేనివిధంగా పెళ్లిళ్ల సంఖ్య గణనీ యంగా తగ్గిపోయింది.  2021తో పోలిస్తే 10.5 శాతం మేర వివాహాల సంఖ్య తగ్గిపో యిందని ఆ దేశ పౌర వ్యవహారాల శాఖ వెల్లడించింది. 2022లో 60.8 లక్షల వివా హాలు జరిగాయని, 2021లో 76.3 లక్షల వివాహాలు జరిగాయని పేర్కొంది. కరోనా మహమ్మారి వ్యాపించిన   ప్రజ లు ఇంటికే పరిమితమైపోవడం, జీవితాలు దుర్భరంగా మారడంతో ఈ పరిస్థితి ఏర్ప డిందని భావించిన ప్రభుత్వం అప్రమత్తమైంది.                       


రన్‌వేపై ఢీకొట్టుకున్న విమానాలు, విరిగిపోయిన రెక్కలు - తృటిలో తప్పిన ప్రమాదం                        


ఇప్పటికే జననాల రేటు కూడా గణనీయంగా తగ్గిపోయింది. 2022లో ప్రతి వెయ్యిమందికి 6.77 చొప్పున జనన రేటు ఉంటే, 2021లో 7.52 చొప్పున నమోదైంది. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో 2022లో జననాల రేటు తగ్గిందన్నమాట. అలాగే అదే సమయంలో మరణాల రేటు పెరిగింది.  1974 తరువాత అత్యధిక మరణాల రేటు 2022లో నమోదైంది. ప్రతి వెయ్యిమందిలో 7.37 మంది ప్రాణాలు కోల్పో యారు. 2022లో చైనా జనాభా గణనీ యంగా తగ్గిన విషయం తెలిసిందే. 60 ఏళ్ల తర్వా త ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. జీవనవ్యయం పెరగ డం, కఠినమైన కుటుంబ నియంత్రణ విధానాలు, కు టుంబ వ్యవస్థపై విముఖత వంటి పరిణామాల నేప థ్యంలో ఈ పరిణామాలు సంభవిస్తున్నాయి.         


అనేక ఆంక్షలు, నిబంధనలను సడలి స్తూ వివాహాలను, ఇద్దరు పిల్నల్ని కనమం టూ  చైనా ప్రభుత్వం ప్రజలను ప్రోత్సహిస్తోంది. అయితే ఖర్చులకు భయపడి పెళ్లిళ్లు చేసుకోవడానికి యువత భయపడుతోంది. ఈ పరి స్థితుల్లో వివాహాలను ప్రోత్సహించాలని చైనా ప్రభు త్వం నిర్ణయించింది.  20 మహానగరాలలో న్యూ ఎరా పేరుతో కల్యాణాలు జరిపించాలని నిర్ణయించింది. ఒంటరి, అవివాహితలు ఐవీఎఫ్‌ ద్వారా పిల్లల్ని కనడానికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారు గత మార్చిలో కొన్ని ప్రతిపాదనలు చేయడం విశేషం. జనాభా పెంచుకోవడానికి చైనా కష్టాలు పడుతోంది. వివాహం చేసుకునే అబ్బాయిలకు పెయిడ్‌ లీవ్‌ ఇవ్వాలని నిర్ణయించారు.