Quad Meet Tension :  క్వాడ్ కూటమి దేశాల నేతల ( Quad ) సమావేశం చైనాకు ఇ్బబందికరంగా మారింది. ఆ దేశాల అధినేతలను భయపెట్టే ప్రయత్నాన్ని చైనాతో ( Chaina ) కలిసి రష్చేయా ( Russia ) సింది.  క్వాడ్ దేశాధినేతలు టోక్యోలో సమావేశం నిర్వహిస్తున్న సమయంలో  చైనా ,  రష్యా యుద్ధ విమానాలు సంయుక్తంగా జపాన్ సమీపంలో యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి. ఈ విషయాన్ని జపాన్ రక్షణ మంత్రి అధికారికంగా ప్రకటించారు.  యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, ఇండియా ,  జపాన్ అధినేతలు ప్రాంతీయ భద్రతపై చర్చలు జరుపుతున్నప్పుడు ఇలా చేయడంపై  జపాన్ ( Japan ) ప్రభుత్వం రష్యా,  చైనాలకు "తీవ్ర ఆందోళన " తెలిపింది.  అయితే చైనా, రష్యా విమానాలు ప్రాదేశిక గగనతలాన్ని ఉల్లంఘించలేదని చెబుదున్నారు  నవంబర్ నుండి రష్యా మరియు చైనాల సుదూర విమానాలు జపాన్ సమీపంలో కనిపించడం ఇది నాలుగోసారని జపాన్ వర్గాలు చెబుతున్నాయి. 


చైనాకు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్- తైవాన్‌కు అండగా ఉంటామని బిడెన్ ప్రకటన


"రెండు చైనా బాంబర్లు జపాన్ సముద్రంలో రెండు రష్యన్ బాంబర్లతో చేరి తూర్పు చైనా సముద్రంలో ఉమ్మడి విన్యాసాలు నిర్వహించాయని" జపాన్ అధికారికంగా ప్రకటించింది.  మొత్తం నాలుగు విమానాలు, రెండు  చైనీస్ బాంబర్లు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. 



దావోస్‌లో ఏపీ ధగధగలు, హై ఎండ్‌ టెక్నాలజీ హబ్‌గా విశాఖ - రెండోరోజు హైలైట్స్ ఇవే


రష్యా ఇంటెలిజెన్స్-సేకరించే విమానం మంగళవారం నాడు ఉత్తర హక్కైడో నుండి సెంట్రల్ జపాన్‌లోని నోటో ద్వీపకల్పానికి వెళ్లిందని, టోక్యోలో శిఖరాగ్ర సమావేశానికి వచ్చిన అధినేతలను రెచ్చగొట్టెలా చైనా, రష్యా వ్యవహరిస్తున్నాయని భఆవిస్తున్నారు.   "మా దేశం మరియు ప్రాంతం యొక్క భద్రత దృక్కోణం నుండి మా తీవ్రమైన ఆందోళనలను దౌత్య మార్గాల ద్వారా తెలియజేసినట్లు" జపాన్ ప్రకటించింది