ChatGPT  Wedding: 


ఐడియా అదిరింది..


చాట్‌జీపీటీ (ChatGPT) మొత్తం ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. జస్ట్ ఒక్క క్లిక్‌తో కంటెంట్ జనరేట్ అవుతోంది. కష్టం అనుకున్న పనులు కూడా పూర్తవుతున్నాయి. చాలా మంది కంటెంట్ క్రియేట్ చేసేందుకు ఇప్పుడు ఈ టూల్‌నే వాడుతున్నారు. కొన్ని కంపెనీలైతే ఉద్యోగులను తీసేసి చాట్‌జీపీటీపైనే ఆధారపడుతున్నాయంటే...ఇదెంత వేగంగా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగాలొక్కటే కాదు. పెళ్లిళ్లు కూడా చేసేస్తాం అంటోంది చాట్‌జీపీటీ. ఇదేదో సైన్స్‌ఫిక్షన్ కాన్సెప్ట్ కాదు. అమెరికాలోని కొలొరాడోలో నిజంగా జరిగిందీ ఘటన. చాట్‌జీపీతో ఓ జంట ఒక్కటైంది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మధ్య చాట్‌జీపీటీతో కనెక్ట్ చేసిన స్పీకర్‌ పెట్టారు. దానికో రోబోటిక్ మాస్క్‌ తగలించారు. ఇంకేముంది పెళ్లికి వచ్చిన వాళ్లను అది ఆహ్వానించింది. అదే పెళ్లి పెద్దగా ఉండి అన్ని పనులూ చక్కదిద్దింది. వాయిస్ యాప్‌తో అందరికీ వెల్‌కమ్ చెప్పింది. హిందూ సంప్రదాయాల్లో పూజారి ఎలా అయితే వేదమంత్రాలు చదువుతూ పెళ్లి తంతు పూర్తి చేస్తాడో...అమెరికాలోని జంటలకూ పెళ్లి చేసేందుకు ప్రత్యేకంగా వ్యక్తులుంటారు. వాళ్లనే "అఫీషియెంట్‌" (Officiant) అంటారు. అలా జరిగితేనే వాటిని లైసెన్స్‌డ్ మ్యారేజ్‌లుగా పరిగణిస్తారు. అయితే...కొలొరాడోలో ఆ రూల్ లేదు. అందుకే...ఈ జంట ఇలా డిఫరెంట్‌గా చాట్‌జీపీటీతో ఒక్కటైంది. పెళ్లి కూతురు తండ్రి ఇచ్చిన ఐడియా ఇది. అఫీషియెంట్ అవసరం లేదు కాబట్టి...చాట్‌జీపీటీనే ఆ ప్లేస్‌లో పెట్టి పెళ్లి చేసుకుంటే బెటర్ అనిచెప్పాడు. ఈ ఐడియా విని అందరూ ఎగ్జైట్ అయ్యారు. వెంటనే ఓకే చెప్పి...ఇలా వార్తల్లో నిలిచారు. 


అందరికీ థాంక్యూ..


ఇంకా హైలైట్ ఏంటంటే అతిథులు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు..? వాళ్లను ఎలా పలకరించాలి..? అని ముందుగానే ఆ చాట్‌బాట్‌కి గైడెన్స్ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే గెస్ట్‌లను పలకరించింది. "ఈ వేడుక చూసేందుకు అంత దూరం నుంచి వచ్చిన వాళ్లందరికీ ధన్యవాదాలు" అంటూ పెళ్లికి టెక్నికల్ టచ్ ఇచ్చింది. 


ఉద్యోగాలకు ఎసరు..


AI టూల్స్‌తో ఉద్యోగాలు పోతాయని ఎక్స్‌పర్ట్స్ చెప్తుంటే...అంత సీన్‌ లేదనుకున్నాం. కానీ...ఇప్పుడదే జరుగుతోంది. అయితే..AI టూల్స్ పని చేయాలన్నా మ్యాన్ పవర్ అవసరమే. కొంత మంది కంటెంట్ రైటర్స్‌...ఇప్పటికే ఈ టూల్స్ వాడుతున్నారు. ప్లాగరైజ్ చేయాలన్న ఉద్దేశం లేకపోయినా...వర్క్ సులువవుతుందని వాడేస్తున్నారు. ఇప్పుడిదే వాళ్ల కొంప ముంచుతోంది. AI టూల్స్, ChatGPTతో కంటెంట్ రాస్తున్న వాళ్లపై ఫైర్ అవుతున్న కంపెనీలు. ఓ యువతిని ఇలానే తొలగించింది కంపెనీ. మార్కెటింగ్‌తో పాటు ఫ్రీనాల్స్ కంటెంట్ రైటింగ్ చేస్తున్న ఆమె...చాట్‌ జీపీటీతో కంటెంట్ రాసింది. టైమ్‌లైన్ దాటిపోతుందన్న టెన్షన్‌ని తట్టకోలేక, సొంతగా కంటెంట్ రాయలేక ఇబ్బంది పడింది. ఇక తప్పని పరిస్థితుల్లో చాట్‌జీపీటీ సాయంతో కంటెంట్ రాసింది. టైమ్‌కి కరెక్ట్‌గా అన్ని ఆర్టికల్స్ పంపేసింది. కొద్ది రోజుల వరకూ పై నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఆ తరవాత ఉన్నట్టుండి ఓ మెయిల్ వచ్చింది. "టర్మినేట్ చేస్తున్నాం" అని తేల్చి చెప్పాడు ఆమె బాస్. ఎందుకని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. AI Content డిటెక్టర్‌తో ఆ ఆర్టికల్స్‌ని చెక్ చేసింది కంపెనీ. అవి AI జనరేటెడ్ కంటెంట్ అని తెలిసిన వెంటనే ఆమెను ఉద్యోగంలో నుంచి తొలగించింది. జీతంలోనూ కోత విధించింది. తన గోడునంతా సోషల్ మీడియాలో చెప్పుకుని బాధ పడింది ఆ బాధితురాలు.


Also Read: కంపెనీకి లాభాలొచ్చినా హైక్‌లు ఇవ్వరా? సీఈవోనే ప్రశ్నిస్తున్న ఉద్యోగులు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial