WHO On Omicron: కరోనా వేరియంట్ ఒమిక్రాన్ మరణాలు పెరుగుతుండటంతో ప్రపంచ దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అలర్ట్ చేసింది. గతంలో భావించిన తరహాలో ఒమిక్రాన్‌ను చిన్న సమస్యలా కొట్టిపారేయవద్దని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రియోసస్ హెచ్చరించారు. ఒమిక్రాన్ బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోందని, పరిస్థితి గమనిస్తే గతంలో డేల్టా వేరియంట్ కేసుల్ని గుర్తుచేస్తోందన్నారు. ఒమిక్రాన్ సోకడంతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోందని, కరోనా పాజిటివిటీ పెరిగినట్లు వెల్లడించారు. 


డేల్టాతో పోల్చితే ఒమిక్రానేం తక్కువ కాదని, వ్యాక్సిన్ తీసుకున్న వారికి సైతం సులువుగా సోకుతున్నందున ఈ వేరియంట్‌ను అంత తేలికగా తీసుకోవద్దు అన్నారు. గతంలో వచ్చిన వేరియంట్ల తరహాలోనే ఒమిక్రాన్ బారిన పడిన వారు ఆసుపత్రుల్లో చేరుతున్నారు, మరణాలు సైతం పెరుగుతున్నాయని గురువారం నాడు డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ పేర్కొన్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌తో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగాయని అభిప్రాయపడ్డారు.


ప్రపంచ వ్యాప్తంగా గత వారం రికార్డు స్థాయిలో 9.5 మిలియన్ల మంది కొవిడ్19 వేరియంట్ ఒమిక్రాన్ బారిన పడగా.. అంతకుముందు వారంతో పోల్చితే 71 శాతం కేసులు పెరిగాయి. పరిస్థితి చేజారుతున్నా ఒమిక్రాన్ తీవ్రతను అంచనా వేయలేకపోతున్నారని, ప్రభావం తక్కువగా ఉంటుందని పలు దేశాలు తేలికగా తీసుకున్నాయని ఒమిక్రాన్‌పై పలు విషయాలు షేర్ చేసుకున్నారు.


2022 జూన్ నాటికి 70 శాతం టీకాలు..
కరోనా వ్యాక్సినేషన్‌పై పలు దేశాలు కాస్త తగ్గినట్లు కనిపిస్తున్నాయి. కానీ మరోవైపు కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండగా కొవిడ్ టీకాల పంపిణీ భారీగా జరగాలన్నారు. ప్రపంచ దేశాలు ఈ ఏడాదిలో పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ పూర్తి చేస్తే మరణాలు, విధ్వంసం నుంచి బయటపడతామని లేకపోతే విపత్కర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ హెచ్చరించారు. ప్రతి దేశం గత ఏడాది సెప్టెంబర్ నాటి 10 శాతం ప్రజలకు టీకాలు, డిసెంబర్ చివరి నాటికి 40 శాతం పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ జరగాలన్నారు. 194 దేశాలకుగానూ 92 దేశాలు లక్ష్యాన్ని చేరుకోలేదు. ఇందులో 36 దేశాలైతే కనీసం 10 శాతం ప్రజలకు కూడా టీకాలు వేయడంలో విఫలమైంది. 2022 జూన్ పూర్తయ్యే నాటికి ప్రపంచ వ్యాప్తంగా 70 శాతం వ్యాక్సినేషన్ జరగాలని అంచనా వేశారు. టీకాల పంపిణీ జరిగా జరగకపోతే మరోసారి ప్రపంచ దేశాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు.


Also Read: WHO On Omicron: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. మరిన్ని ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొస్తాయని డబ్ల్యూహెచ్‌ఓ వార్నింగ్..!


ఒమిక్రాన్‌తోనే కరోనా అంతం కాదు..
కరోనా వేరియంట్ ఒమిక్రాన్ చివరి వేరియంట్ కాదని డబ్ల్యూహెచ్‌ఓ టెక్నికల్ విభాగాధిపతి మరియా వాన్ కెర్ఖోవ్ అన్నారు. ఒమిక్రాన్ నుంచి మరిన్ని వేరియంట్లు పుట్టుకొస్తాయన్నారు. కొవిడ్ నిబంధనల్ని కఠినంగా పాటించడం ద్వారా మాత్రమే కరోనా వేరియంట్లు, వైరస్‌కు చెక్ పెట్టడం సాధ్యమని.. ముఖానికి మాస్కులు తప్పనిసరి ధరించి ఇళ్లనుంచి బయటకు రావాలని సూచించారు. మూతి కిందకు మాస్కు పెట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదన్నారు. తక్కువ ప్రభావం చూపుతుందని భావించిన ఒమిక్రాన్ ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో ప్రపంచ దేశాలు దాని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. 


Also Read: వనమా రాఘవ ఆగడాలకు అడ్డేలేదా?... ఆది నుంచి ఆరోపణల పర్వమే...!


Also Read: Mahesh Babu Covid 19: మహేష్ బాబుకు కోవిడ్-19 పాజిటివ్.. ఆందోళనలో అభిమానులు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి