కిమ్ జోంగ్ ఉన్.. ఏం చేసినా సంచలనమే. ప్రజలను హింసించడంలో కిమ్‌కు సాటి ఎవరూ లేరు. అలాంటి కిమ్‌కు మద్దతుగా ఇటీవల ఓ ర్యాలీ నిర్వహించారు. ఇందులో వేలాది మంది ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో ప్యాంగ్‌యాంగ్‌లోని కిమ్-2 సంగ్ స్క్వేర్ కిక్కిరిసిపోయింది.
ప్రతి ఏడాది జనవరి తొలి వారంలో ఈ తరహా ర్యాలీని నిర్వహించటం ఉత్తర కొరియాలో ఆనవాయితీగా వస్తోంది. ఈ ర్యాలీలో పాల్గొనటం ద్వారా అధ్యక్షుడు కిమ్‌పై తమకున్న అభిమానాన్ని ప్రజలు చాటుకుంటారు. ఇంతవరకు బానే ఉంది. అయితే ప్రస్తుతం ప్రపంచాన్ని ఒమిక్రాన్ వేరియంట్ గడగడలాడిస్తోంది.
ఇలాంటి సమయంలో వేలాది మంది జనంతో కిమ్ చేసిన ఈ ర్యాలీ ఎటు దారి తీస్తుందోనని ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటికే కరోనా ధాటికి ఉత్తర కొరియా ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతింది. దేశంలో ఆహార కొరత కూడా ఏర్పడింది. ఇలాంటి సమయంలో మళ్లీ ఒమిక్రాన్‌కు కిమ్ స్వాగతం పలకడం ఆశ్చర్యమే.
స్లిమ్ అయిన కిమ్..
కొద్ది రోజులుగా బయటి ప్రపంచానికి కనబడని కిమ్.. ఇటీవల ఓ సమావేశానికి హాజరయ్యారు. అయితే కిమ్ మరీ స్లిమ్‌గా మారడంతో ఆయన ఆరోగ్యంపై మరోసారి వార్తలు వచ్చాయి. అయితే దేశంలో ఆహార కొరతను తగ్గించేందుకే కిమ్ తక్కువగా తింటున్నారని అక్కడి అధికారులు చెప్పినట్లు సమాచారం.
షాకింగ్ నిర్ణయాలు..
ఉత్తర కొరియాలో 11 రోజుల పాటు ప్రజలెవరూ నవ్వొద్దు, మద్యం తాగొద్దు, వేడుకలు చేసుకోవద్దని ఇటీవల కిమ్ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. వింతగా ఉంది కదా.. ఇంతకీ ఇదంతా దేనికో తెలుసా? కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ మరణించి 10 ఏళ్లు పూర్తయింది. ఆయన సంస్మరణార్థం ఉత్తర కొరియాలో 11 రోజులు సంతాప దినాలుగా జరిపారు. అందుకోసమే ఈ ఆంక్షలు విధించారు.
Also Read: PM Security Lapse: మోదీ- రాష్ట్రపతి భేటీ.. పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై తీవ్ర ఆందోళన
Also Read: PM Modi Update: 'ప్రాణాలతో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చా.. మీ సీఎంకు థ్యాంక్స్'.. పంజాబ్ అధికారులతో ప్రధాని