PM Security Lapse: మోదీ- రాష్ట్రపతి భేటీ.. పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై తీవ్ర ఆందోళన

ABP Desam Updated at: 06 Jan 2022 04:26 PM (IST)
Edited By: Murali Krishna

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. పంజాబ్ పర్యటనలో ప్రధానికి ఎదురైన భద్రతా లోపాలపై చర్చించారు.

మోదీ- రాష్ట్రపతి భేటీ

NEXT PREV

పంజాబ్ పర్యటనలో ప్రధానికి ఎదురైన భద్రతా లోపాలపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రధాని మోదీతో రాష్ట్రపతి భేటీ అయ్యారు. ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. 











రాష్ట్రపతి భవన్‌లో నేడు ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో భేటీ అయ్యారు. పంజాబ్‌లో నిన్న ప్రధాని మోదీకి పర్యటనలో తలెత్తిన భద్రతా లోపాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్రపతి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.                                          - రాష్ట్రపతి కార్యాలయం


వెంకయ్య ఆందోళన..





ఈ వ్యవహారంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు వెంకయ్య.






భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు.. ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. పంజాబ్ పర్యటనలో ఎదురైన భద్రతా లోపాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు.                                       - ఉపరాష్ట్రపతి కార్యాలయం

ఏం జరిగింది?

 

పంజాబ్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోదీ వెళ్లారు. అయితే మార్గ మధ్యంలో ఓ ఫ్లైఓవర్‌పై ప్రధాని కాన్వాయ్‌ను కొంత మంది నిరసనకారులు అడ్డుకున్నారు. ఇది భద్రతాపరమైన సమస్యలకు కారణమైంది. దీంతో ప్రధాని మోదీ తిరిగి భఠిండా విమానాశ్రయానికి వెళ్లారు. అటు నుంచి దిల్లీకి పయనమయ్యారు.


ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేసి నివేదికను సమర్పించాలని కోరింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.


అయితే భద్రతా వైఫల్యాల వల్లే ప్రధాని పర్యటన రద్దయిందనే వాదనను పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఖండించారు. అసలు ప్రధాని మోదీ రోడ్డు మార్గంలో వస్తున్నారనే సమాచారమే తమకు అందలేదన్నారు. ప్రధాని పర్యటన రద్దు కావడంపై చింతిస్తున్నామన్నారు.              


Also Read: PM Modi Update: 'ప్రాణాలతో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చా.. మీ సీఎంకు థ్యాంక్స్'.. పంజాబ్ అధికారులతో ప్రధాని


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి





Published at: 06 Jan 2022 02:59 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.