Indian Army In POK :ఎప్పటి నుంచో అనుకుంటున్న ప్రజలంతా కోరుకుంటున్న గడియలు రానే వచ్చాయి. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోకి భారత సైన్యం ఎంట్రీ ఇచ్చినట్టు సమాచారం అందుతోంది. దీనిపై ఇంత వరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ భారత్ సైన్యం మాత్రం ఆ ప్రాంతంలోకి వెళ్లి ఉగ్రవాదుల భరతం పట్టే పనిలో ఉందని తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Continues below advertisement


మరోవైపు భారత్ చేస్తున్న దాడులకు పాకిస్థాన్ వణికిపోతోంది. చైనా ఇచ్చిన పేలని బాంబులతో యుద్ధం చేస్తున్నట్టు ఆ దేశ ప్రజలకు కలరింగ్ ఇస్తోంది. ఆ దేశ మీడియాలో హైక్ క్రియేట్ చేస్తోంది. భారత్‌ను కవ్వించి తప్పు చేసిన పాకిస్థాన్ దానికి తగ్గ ఫలితాన్ని అనుభవిస్తోంది. ఆ దేశా రాజధాని ఇస్లామాబాద్ ను భారత ఆర్మీ డ్రోన్‌లు ధ్వంసం చేశాయి. పాక్ ప్రధాని అధికారిక భవనం పక్కనే బాంబు వర్షం కురిపించింది భారత్. 


భారత్ దూకుడు చూసిన పాకిస్థాన్ ప్రధాన మంత్రి బిచాణా సర్దేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు బంకర్లలో దాక్కున్న షాబాజ్ షరీఫ్  ఇప్పుడు విదేశాలకు పారిపోయేందుకు స్కెచ్ వేస్తున్నారు. ఇప్పటికే ఆ దేశ సైన్యాధ్యక్షుడు ఫ్యామిలీతో విదేశాలకు పారిపోయారు. ఇప్పుడు ప్రధానమంత్రి కూడా విదేశాలకు చెక్కేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.