Multiple loud explosions heard in Jammu : పాకిస్తాన్‌ మళ్లీ మళ్లీ భారత్ పై దాడికి ప్రయత్నిస్తోంది. గురువారం సాయంత్రం జమ్మూలో  పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. జమ్ము ప్రజల్లో భయాందోళనలను  కలిగించాయి.   యు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం దాడులు చేసిన ఒక రోజు తర్వాత ఈ పేలుడు సంభవించింది. పేలుడుకు కారణమేమిటో ఇప్పటికీ  స్పష్టత లేదు. 


అయితే పాకిస్తాన్  రాకెట్ ప్రయోగిచిందని దృశ్యాలు వైరల్ అయ్యాయి. జమ్మూ ఎయిర్ స్ట్రిప్ మీద దాడులు చేశారు. అదే సమయంలో డ్రోన్ దాడులు కూడా జరిగినట్లుగా తెలుస్తోంది. 


జమ్మూలో పూర్తిగా బ్లాక్‌అవుట్ అయింది.  బాంబు దాడులు, షెల్లింగ్ , క్షిపణి దాడులు జరిగినట్లు అనుమానిస్తున్నారు. అని జమ్మూ కాశ్మీర్ మాజీ డిజిపి శేష్ పాల్ వైద్   ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 



జమ్మూపై వరుసగా వచ్చి పడిన బాంబులు, రాకెట్ల దృశ్యాలను స్థానికులు వీడియోలుగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  





 బాంబులు వేసేందుకు వస్తున్న పాకిస్తాన్ డ్రోన్లను పలు చోట్ల భారతీయ సైన్యం కూల్చి వేసింది. 





 పౌర నివాసాలపై దాడులు చేసి పాకిస్తాన్ దారుణమైన తప్పిదం చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.  



జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మందిని, ఎక్కువగా పర్యాటకులను ఊచకోత కోసిన రెండు వారాల తర్వాత, బుధవారం భారతదేశం 'ఆపరేషన్ సిందూర్'  నిర్వహించింంది.  యు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద ప్రదేశాలపై లక్ష్యంగా దాడులు నిర్వహించింది. జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (LOC) వెంబడి ఖచ్చితమైన ఆయుధాలతో లక్ష్యంగా చేసుకున్న ఐదు ఉగ్రవాద శిక్షణా శిబిరాలు PoK లోపల తొమ్మిది నుండి 30 కి.మీ.ల మధ్య ఉన్నాయి, అయితే అంతర్జాతీయ సరిహద్దు (IB)కి అవతలి వైపున ఉన్న నాలుగు లక్ష్యాలు పాకిస్తాన్ లోపల ఆరు నుండి 100 కి.మీ.ల దూరంలో ఉన్నాయి.