Indian air defence brings down Pakistan F-16 : జమ్ముతో పాటు పలు చోట్ల డ్రోన్, ఫైటర్ జెట్లతో విరుచుకుపడిన పాకిస్తాన్ కు భారత వైమానిక దళం వెంటనే బుద్ది చెప్పింది.  భారత వైమానిక రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ F-16 విమానాలను కూల్చివేసింది.  ఉదంపూర్‌లో డ్రోన్ దాడులను కూడా తిప్పికొట్టారు .  అఖ్నూర్‌లో ఒక డ్రోన్‌ను కూల్చివేశారు. తీవ్ర ఉద్రిక్తతలో, పాకిస్తాన్ ఒకేసారి విమానాశ్రయంతో సహా జమ్మూలోని అనేక ప్రదేశాలపై దాడి చేసింది. గురువారం రాత్రి అంతర్జాతీయ సరిహద్దు మీదుగా జమ్మూపై రాకెట్లను ప్రయోగించారు. ఒక డ్రోన్ జమ్మూ విమానాశ్రయంలో పేలింది.  దీనికి ప్రతిస్పందనగా భారత యుద్ధ విమానాలు వేగంగా దూసుకుపోయాయి. భారతదేశం తన వైమానిక రక్షణ వ్యవస్థలను  యాక్టివ్  చేసింది. పాకిస్తాన్  రాకెట్లను కూల్చివేసింది. 

జమ్మూ సివిల్ విమానాశ్రయం, సాంబా, ఆర్ఎస్ పురా, అర్నియా  సమీప ప్రాంతాల మీదుగా  ప్రయోగించిన ఎనిమిది పాకిస్తానీ క్షిపణులను ఎస్-400 వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. జమ్మూ విశ్వవిద్యాలయం సమీపంలో రెండు పాకిస్తానీ డ్రోన్లను కూల్చివేసింది.  జైసల్మేర్‌లో పాకిస్తానీ డ్రోన్లను అడ్డుకున్నారు.  

 ఫైటర్ జెట్ ను కోల్పోవడం పాకిస్తాన్ కు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.  మరో రెండు చైనీస్ ఫైటర్ జెట్లను  కూడా భారత్ దళాలు కూల్చివేశాయి. 

పాకిస్తాన్ టార్గెట్ చేసుకున్న ప్రాంతాల్లో కంప్లీట్ బ్లాక్ అవుట్ ప్రకటించారు. కరెంట్ నిలిపివేశారు.