Karachi Bakery Problem : సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు దేశంలో కొంత మంది దేశభక్తిని ప్రదర్శించుకోవడానికి కొన్ని నిరసనలు చేపడుతున్నారు. ఇలాంటి నిరసనల వల్ల హైదరాబాద్‌‌లో ప్రసిద్ధి చెందిన కరాచీ బేకరి ఇ్బబంది పడుతోంది.  ప్రతి సారి టార్గెట్ అయ్యే బ్రాండ్ కరాచీ బేకరి. కరాచీ పాకిస్తాన్ లో ఉన్న పట్టణం పేరు. కానీ ఆ కరాచీకి చెందిన వారు లేదా పాకిస్తాన్ వాసులు ఎవరూ   ఆ బ్రాండ్ తో ఇక్కడ వ్యాపారం చేయడం లేదు. కరాచీ బేకరి యజమానులు  అచ్చమైన భారతీయులు. దేశ విభజన సమయంలో ఇండియానే తమ దేశం అని అన్నీ వదులుకుని వచ్చేశారు. పైగా హిందువులు. 

దేశ విభజనకు ముందు భారత్ లో కరాచీ కూడా దేశంలో ఓ భాగం.  దేశ ప్రముఖ నగరాల్లో ఒకటి. అక్కడ ప్రత్యేకత..బేకరీ. ఒక్కో సిటీకి ఒక్కో గుర్తింపు ఉన్నట్లుగా కరాచీ బిస్కెట్లకు ప్రిసిద్ధి. దేశవిభజన తర్వాత ఇక్కడకు వచ్చేసిన వారు కరాచీ బేకరీ పేరుతో వ్యాపారం ప్రారంభించారు. దాన్ని విస్తరించుకున్నారు. గుండెల నిండుగా దేశభక్తి ఉన్న వారికి పాకిస్తాన్ కరాచీకి సంబంధమే లేదు. 1953 నుంచి వారు వ్యాపారం చేస్తున్నారు.ఎప్పుడూ వారికి పేరు సమస్య లేదు. కానీ కొత కొన్నేళ్లుగా మాత్రం వారికి సమస్యలువస్తున్నాయి. 

హైదరాబాద్‌లోని కరాచీ బేకరీ  1953లో ఖాన్‌చంద్ రామ్‌నాని  అనే సింధీ వ్యాపారి  ప్రారంభించారు.   అతను 1947లో భారత్-పాకిస్తాన్ విభజన సమయంలో కరాచీ నుండి హైదరాబాద్‌కు వలస వచ్చాjg.  ఈ బేకరీని అతను తన పుట్టిన ఊరైన కరాచీ నగరం పేరుతో ప్రారంభించాడు. ప్రస్తుతం, కరాచీ బేకరీని రామ్‌నాని కుటుంబం యొక్క మూడవ తరం నిర్వహిస్తోంది. కరాచీ బేకరీ 1953లో హైదరాబాద్‌లోని మొజాంజహీ మార్కెట్‌లో మొదటి స్టోర్‌తో ప్రారంభమైంది. ఖాన్‌చంద్ రామ్‌నాని తన నలుగురు  కుమారులతో కలిసి ఈ వ్యాపారాన్ని నడిపాడు, మొదట్లో టోకు వ్యాపారులకు బేకరీ ఉత్పత్తులను విక్రయించాడు. 1960లలో  ఫ్రూట్ బిస్కెట్లు , ఒస్మానియా బిస్కెట్ల తయారీ  ప్రారంభించారు. కరాచీ  బేకరీ కి హైదరాబాద్‌లో 25 స్టోర్‌లు ఉన్నాయి.   ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం వంటి నగరాలకూ విస్తరించింది. ఇది యుఎస్‌ఎ, కెనడా, యూకే, ఆస్ట్రేలియా,  గల్ఫ్ దేశాలతో సహా 20 కంటే ఎక్కువ దేశాలకు బిస్కెట్లు ఎగుమతి చేస్తుంది.    

 

కరాచీ బేకరీ పేరు కారణంగా  పాకిస్తాన్‌ కు చెందినదిగా భావిస్తూంటారు.  2019లో, బెంగళూరులోని ఒక శాఖపై దాడి జరిగింది, దీనిలో "కరాచీ" పేరును తొలగించాలని డిమాండ్ చేశారు. 2021లో ముంబైలో శివసేన నాయకుడు పేరు మార్చమని ఒత్తిడి చేశారు. అయినా బ్రాండ్, భావోద్వేగం కారణంగా యజమానులు పేరు మార్చుకునేందుకు ఆసక్తి చూపించలేదు.  కరాచీ బేకరీ పూర్తిగా భారతీయ బ్రాండ్ అని దుకాణాల ముందు పోస్టర్లు పెట్టుకున్నారు. తమ  వ్యాపార సంస్థపై జరుగుతున్న ప్రచారం, ప్రతీ సారి టార్గెట్ అవుతున్న వైనంతో వారు మనస్తాపానికి గురయ్యారు. దుకాణాల ముందు తాము వంద శాతం ఇండియన్లం అని.. పరోక్షంగా హిందువులం అని చెప్పుకోవాల్సి వస్తోంది.