Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode సహస్ర, విహారిని పెళ్లి పీటల మీద కూర్చొపెడతారు. లక్ష్మీ వెళ్లిపోతుంటే విహారి తల్లికి చెప్పడంతో యమున లక్ష్మీ కోసం బయటకు వెళ్తుంది. లక్ష్మీని పిలిచి ఎక్కడికి వెళ్తున్నావ్ అంటే నేను పెళ్లి దగ్గర ఉంటే సహస్రమ్మ వాళ్లకి ఇబ్బందిగా ఉందట నేను కాసేపు అలా బయటకు వెళ్లి వస్తానని అంటుంది. వాళ్లు అనడం నువ్వు వెళ్లడం భలే ఉంది రా లక్ష్మీ అని అంటుంది. యమున బలవంతంగా లక్ష్మీని లోపలికి తీసుకెళ్తుంది.
లక్ష్మీని చూసిన విహారి సంతోషంగా ఫీలవుతాడు. యమున మీద పద్మాక్షి అరిచి నువ్వు దాన్ని అక్కడే వదిలేసి లోపలికి రా అని అంటుంది. తనేం చేసిందని యమున అడుగుతుంది. లక్ష్మీ గొడవలు వద్దు వెళ్లిపోతా అంటుంది. మీ ఇద్దరూ ప్రత్యేకంగా ఏమైనా చేయాలా గజపాదాలు అని అంటుంది. దాని వల్ల పెళ్లి ఆగుతుందని నేను దాన్ని బయట ఉండమంటే నువ్వు తీసుకొచ్చావా అని అడుగుతుంది. భక్తవత్సలం కూతురితో తను మనిషే కదా శుభమా అని పెళ్లి జరుగుతుంటే తను ఎందుకు అంటారు. మనిషి రూపంలో ఉన్న శని తను అంటుంది. అందరూ పద్మాక్షిని పిలుస్తారు. లక్ష్మీ బయటే ఉండి పెళ్లి చూస్తానని చెప్పి యమునని పంపిస్తుంది.
పెళ్లి తంతు మళ్లీ ప్రారంభం అవుతుంది. పంతులు జీలకర్ర బెల్లం ఇద్దరికీ ఇచ్చి ఒకరి తల మీద ఒకరికి పెట్టుకోమని అంటారు. అది పెట్టే లోపు నిజం చెప్పాలని విహారి అనుకుంటాడు. సరిగ్గా జీలకర్రా బెల్లం పెట్టేటైంకి లక్ష్మీ కింద పడిపోతుంది. దాంతో విహారి జీలకర్ర బెల్లం పెట్టకుండా లేచి నిల్చొండిపోతాడు. అందరూ కంగారుగా చూస్తారు. పండు, యమున, వసుధలకు లక్ష్మీ దగ్గరకు పరుగులు తీస్తారు. వద్దన్నా దాన్ని తీసుకొచ్చారు చూడండి దాని నాటకాలు అని అంటుంది. నా కూతురి పెళ్లి ఆపడానికి అది ఎన్ని డ్రామాలు అయినా ఆడుతుందని అంటారు. విహారి వెళ్లబోతే సహస్ర చేయి పట్టి ఆపి అందరూ ఉన్నారులే బావ నువ్వు ఇక్కడే ఉండు అని అంటుంది.
యమున, పండు వాళ్లు లక్ష్మీని లోపలికి తీసుకెళ్తారు. డాక్టర్ వచ్చి లక్ష్మీని చూస్తుంది. ఏదో విషయంలో బాగా ఒత్తిడికి లోనయైంది అందుకే పడిపోయింది తనకు బాగా రెస్ట్ అవసరం ఇంజక్షన్ ఇచ్చాను లేస్తుందని అని డాక్టర్ చెప్తారు. ఇంతలో లక్ష్మీ కళ్లు తెరుస్తుంది. పద్మాక్షి వాళ్లు పెళ్లి మొదలు పెట్టకుండాటెన్షన్‌గా ఉంటారు. పద్మాక్షి లోపలికి కోపంగా వెళ్తుంది. లక్ష్మీ పెళ్లి దగ్గరకు వెళ్లమని యమున వాళ్లకి చెప్తుంది. పద్మాక్షి కోపంగా అన్నీ విసిరేస్తుంది. నీ డ్రామాల వల్ల మేం అంతా పోతామే నీకేం కాదు అని అంటుంది. లక్ష్మీ డ్రామాలు ఆడదు అని యమున అంటే అంత వరకు బాగానే కరెక్ట్‌గా జీలకర్ర బెల్లం పెట్టినప్పుడే ఇలా అయిందా. దీని వల్ల పెళ్లి సగంలో ఆగిపోయింది అని అంటుంది. యమున లక్ష్మీని కూడా రమ్మని అంటే పద్మాక్షి యమునతో నీకు ఇంకా బుద్ధి రాలేదా.. అది బయటకు వస్తే చంపేస్తా అని అంటుంది.
పద్మాక్షి వెళ్లి ముహూర్తానికి టైం అయిందా అని అడుగుతుంది. అయిందని పంతులు చెప్తే వెంటనే మాంగల్యధారణ జరిపించమని అంటుంది. లక్ష్మీకి బాగానే ఉందని యమున చెప్తుంది. ఇక జీలకర్రా బెల్లం పెట్టమని పంతులు అంటే పద్మాక్షి అక్కర్లేదని ఏకంగా తాళి కట్టించమని అంటుంది. పంతులు విహారికి తాళి ఇస్తే విహారి తీసుకోడు అందరూ షాక్ అయి చూస్తారు. మళ్లీ చెప్పడంతో విహారి తాళి తీసుకుంటాడు. సహస్ర చాల టెన్షన్ పడుతుంది. విహారి తాళి తీసుకొని కట్టడానికి రెడీ అయి సహస్ర మెడ వరకు తీసుకెళ్లి మొదటి ముడి వేస్తాడు. ఇంతలో లక్ష్మీతో పెళ్లి గుర్తొచ్చి తాళి వెనక్కి తీసేసి కింద పడేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: చిన్ని రాజు కూతురని దేవాకి తెలిసిపోతుందా.. అన్న సంతోషం చూసి పొంగిపోయిన కావేరి!