Telugu TV Serial TRP Ratings - Zee Telugu and Star Maa: తెలుగు టీవీ సీరియల్స్ రీసెంట్ హిస్టరీ చూస్తే నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాధ్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న 'కార్తీక దీపం 2' అత్యంత వీక్షకాదరణతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసింది. అయితే గత కొన్ని వారాలుగా ఆ సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ విషయంలో కాస్త వెనుక బడింది. ఈ వారం రేటింగ్స్ చూస్తే మళ్ళీ టాప్ ప్లేస్ అందుకుంది. ఈ వారం స్టార్ మా, జీ తెలుగు ఛానల్స్‌లో టీఆర్పీ రేటింగ్స్ పరంగా టాప్ 10 సీరియల్స్ ఏమిటి? అనే లిస్టు చూస్తే...
కార్తీక దీపం 2 నెంబర్ వన్...తర్వాత మెగాస్టార్ సీరియల్!స్టార్ మా ఛానల్ టీఆర్పీ రేటింగ్స్ లిస్టు చూస్తే... 10.86తో 'కార్తీక దీపం 2: నవ వసంతం' సీరియల్ మొదటి స్థానం కైవసం చేసుకుంది. ఆ తర్వాతి స్థానంలో బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, సీనియర్ హీరోయిన్ ఆమని ప్రధాన పాత్రలలో రూపొందుతున్న 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ ఉంది. దానికి 10.54 టీఆర్పీ వచ్చింది. ఇక మూడో స్థానంలో 10.32 టీఆర్పీతో 'గుండె నిండా గుడిగంటలు' ఉంది.
ప్రతి వారం టీఆర్పీ రేటింగ్స్ టాప్ 10 లిస్ట్ చూస్తే... మొదటి ఐదు స్థానాలలో స్టార్ మా సీరియల్స్ తప్పకుండా ఉంటాయి. ఈ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. 'కార్తీక దీపం 2', 'ఇల్లు ఇల్లాలు పిల్లలు', 'గుండె నిండా గుడి గంటలు', సీరియల్స్ తర్వాత ఈ ఛానల్‌లో మిగతా లిస్టు చూస్తే... 'ఇంటింటి రామాయణం' (9.60), 'చిన్ని' (7.41), 'బ్రహ్మముడి' (7.10), 'పలుకే బంగారమాయెనా' (6.56), 'నువ్వుంటే నా జతగా' (7.00), 'నిన్ను కోరి' (5.17), 'పాపే మా జీవనజ్యోతి' (5.68), 'మామగారు' (5.24) టీఆర్పీ సాధించాయి.
జీ తెలుగులో మళ్లీ చామంతి టాప్!జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ విషయానికి వస్తే.. 5.94తో 'చామంతి' మొదటి స్థానంలో నిలిచింది. కేవలం 0.03 డిఫరెన్స్ కారణంగా 'మేఘ సందేశం' రెండో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఆ సీరియల్ టీఆర్పీ 5.91.
జీ తెలుగులో టీఆర్పీ పరంగా టాప్ 3 ప్లేస్‌లో ఈ వారం 'పడమటి సంధ్యారాగం' నిలిచింది. ఆ సీరియల్ 5.78 టీఆర్పీ సాధించింది. ఆ తరువాత 'జగద్ధాత్రి' (5.33), 'లక్ష్మీ నివాసం' (4.71), 'అమ్మాయిగారు' (4.51), 'కలవారి కోడలు కనకమహాలక్ష్మి' (4.51), 'ఉమ్మడి కుటుంబం' (4.16), 'దీర్ఘ సుమంగళీభవ' (4.08) టీఆర్పీ సాధించాయి.
ఈటీవీలో 'మనసంతా నువ్వే' మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. ఆ సీరియల్ టీఆర్పీ 3.23. ఆ తరువాత 'రంగులరాట్నం' (3.08), 'బొమ్మరిల్లు' (2.92), 'ఝాన్సీ' (2.56) టీఆర్పీ సాధించాయి. జెమినీ టీవీలో 'భైరవి' సీరియల్ 1.21 టీఆర్పీ సాధించింది. మిగతా సీరియల్స్ అన్ని ఒకటిలోపే ఉన్నాయి. ఎప్పటిలా జెమిని టీవీ సీరియల్స్ మరోసారి చివరి స్థానాల్లో ఉన్నాయి.
Also Read: థియేటర్లలో కాదు... డైరెక్ట్‌గా ఓటీటీలోకి హిందీ సినిమా రిలీజ్... ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్