భారత్ భూభాగంలోకి చొరబడిన తీవ్రవాదులు పహల్గాంలో మన దేశ ప్రజల మీద దాడి చేయడం... అందుకు బదులుగా పాకిస్తాన్‌లో తీవ్రవాద స్థావరాల మీద భారత సైన్యం దాడి చేసి ధ్వంసం చేయడం తెలిసిన విషయాలే. ఆపరేషన్ సింధూర్ గురించి యావత్ ప్రపంచం మాట్లాడుకుంటోంది. పాక్ మీద భారత్ చేసిన దాడి ప్రభావం తెలుగు సినిమాల మీద లేదు. కానీ ఒక హిందీ సినిమాపై పడింది. ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిస్థితుల నేపథ్యంలో నెలకొన్న వాతావరణం వల్ల థియేటర్లలో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలోకి సినిమాను విడుదల చేస్తున్నారు.

మే 9న థియేటర్లలో విడుదల చేయడం లేదు...మే 16వ తేదీన డైరెక్ట్‌గా ఓటీటీలోకి భూల్ చుక్ మాఫ్‌!Bhool Chuk Maaf OTT release date announced: బాలీవుడ్ విలక్షణ నటుడు రాజ్ కుమార్ రావ్ (Rajkummar Rao) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'భూల్ చుక్ మాఫ్'. ఇందులో వామికా గబ్బి హీరోయిన్. తెలుగులో సుధీర్ బాబు 'భలే మంచి రోజు' సినిమాలో ఆ అమ్మాయి నటించింది. ఆ తరువాత హిందీలో సినిమాలు చేస్తూ వస్తోంది. ఈ సినిమాను మే తొమ్మిదిన థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. కానీ, ఇప్పుడు 16న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి తీసుకు వస్తున్నామని అనౌన్స్‌ చేశారు. 

Also Read: థియేటర్లలో విడుదలైన 20 రోజులకే Prime Videoలోకి 'ఓదెల 2'... ఐదు భాషల్లో తమన్నా సినిమా స్ట్రీమింగ్

'భూల్ చుక్ మాఫ్' అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలు పెట్టారు. దేశవ్యాప్తంగా పలు థియేటర్లలో టికెట్స్ సైతం అమ్మారు. అయితే... ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన సమయంలో ఆపరేషన్ సింధూర్ జరిగింది. నార్త్ ఇండియాలో ప్రజలు ప్రస్తుతం సినిమాలపై అంత ఆసక్తి కనబరుస్తారా? థియేటర్లకు వస్తారా? అనేది కాస్త సందేహమే. అందువల్ల థియేటర్లలో కాకుండా 'భూల్ చుక్ మాఫ్' సినిమాను మే 16వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ చేయనున్నట్టు చిత్ర బృందం అనౌన్స్ చేసింది. టికెట్స్‌ బుక్ చేసుకున్న వాళ్లకు అమౌంట్ రిటర్న్ చేయనున్నారు.

Also Readమహేష్ బాబు, సూర్య, రామ్ చరణ్, ఎన్టీఆర్... టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాల్లో నటించినోడు... Ullu Show అడల్ట్ షో 'హోస్ అరెస్ట్' వివాదం... ఇప్పుడు రేప్ కేస్... ఎవరీ అజాజ్ ఖాన్?

థియేటర్లలో ప్రేక్షకులతో కలిసి సినిమా విడుదలను సెలబ్రేట్ చేసుకోవాలని తాము భావించామని అయితే సినిమా కంటే దేశం ముఖ్యం కనుక దేశ భద్రత తొలి ప్రాధాన్యత కనుక తమ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ నిర్మాత దినేష్ విజన్ తెలిపారు.