థియేటర్లలో విడుదలైన జస్ట్ 20 డేస్‌‌కు ఓటీటీలోకి మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) కొత్త సినిమా వచ్చింది. మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేసిన సినిమా 'ఓదెల 2' (Odela 2). తమన్నా ప్రధాన పాత్రలో నటించారు.‌ ఏప్రిల్ 17న థియేటర్లలో సినిమా విడుదల అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓదెల 2...ఈ మూవీ ఎన్ని భాషలలో ఉంటుందో తెలుసా?Odela 2 OTT Streaming Platform: తెలుగు, తమిళ భాషల్లో తమన్నా స్టార్ హీరోయిన్. హిందీలోనూ ఆమె పాపులారిటీ స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు. శ్రద్ధా కపూర్ 'స్త్రీ 2' బ్లాక్ బస్టర్ సాధించడం వెనక తమన్నా ప్రత్యేక గీతం 'ఆజ్ కి రాత్' ఉన్న సంగతి మర్చిపోకూడదు. 

తమన్నాకు పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ ఉండడంతో 'ఓదెల 2'ను హిందీలో కూడా విడుదల చేశారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ తమిళ, మలయాళ, కన్నడ భాషలలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ పేర్కొంది. తమన్నా సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆ సంస్థ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మే 8వ తేదీ నుంచి వీక్షకులు అందరికీ ఈ సినిమా అందుబాటులో ఉంటుందని తెలిపింది. థియేటర్లలో ఏప్రిల్ 17న సినిమా విడుదల కాగా... మే ఏడవ తేదీ ముగిసిన వెంటనే, మే 8 మిడ్ నైట్ నుంచి ఓటీటీలోకి సినిమా వచ్చింది. అదీ సంగతి.

Also Readమహేష్ బాబు, సూర్య, రామ్ చరణ్, ఎన్టీఆర్... టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాల్లో నటించినోడు... Ullu Show అడల్ట్ షో 'హోస్ అరెస్ట్' వివాదం... ఇప్పుడు రేప్ కేస్... ఎవరీ అజాజ్ ఖాన్?

శివ శక్తిగా తమన్నా నట విశ్వరూపం!కమర్షియల్ సినిమాలలో తమన్నా గ్లామరస్ రోల్స్ చేశారు. అయితే 'ఓదెల 2'తో తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడం కోసం ఆవిడ గట్టిగా ప్రయత్నించారు. గ్లామరస్ షో వంటి దానికి దూరంగా, దాదాపుగా సినిమా అంతటా ఒకే కాస్ట్యూమ్‌లో కనిపించారు. శివ శక్తిగా బరువైన పాత్రను పోషించారు. భారీ డైలాగులు చెప్పడంతో పాటు నట విశ్వరూపం చూపించడానికి కృషి చేశారు. అయితే థియేటర్ల నుంచి తమన్నా సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. వసూళ్లు వచ్చినప్పటికీ... కొంత మంది తమ ఆశించిన స్థాయిలో సినిమా లేదని చెప్పారు. మరి డిజిటల్ రిలీజ్ తర్వాత వీక్షకుల నుంచి ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.

Also Read: పాకిస్తాన్ మైండ్ బ్లాక్ అయ్యేలా దెబ్బ కొట్టిన భారత్... మాక్ డ్రిల్ అని నేలమట్టం చేశారుగా... 'ఆపరేషన్ సింధూర్'పై బెస్ట్ మీమ్స్

'ఓదెల 2' కథ ఏమిటి? ఏం జరిగింది?శోభనం రోజున పెళ్లి కుమార్తెలను తీసుకువెళ్లి అత్యాచారం చేసేది తన భర్త అని తెలిసి తిరుపతి (వశిష్ట సింహ)ను రాధ (హెబ్బా పటేల్) చంపేస్తుంది. తిరుపతి చేసిన పనికి అతని శవాన్ని దహనం చేయకుండా సమాధి శిక్ష విధిస్తారు గ్రామ ప్రజలు. తిరుపతి ఆత్మకు శాంతి కలగకపోవడంతో ప్రేతాత్మగా మారుతుంది. గ్రామస్తులు అందరిని వేధించడం మొదలు పెడుతుంది. ఆ విషయం తెలిసిన శివ శక్తి అలియాస్ భైరవి (తమన్నా) ఆ ప్రేతాత్మను కట్టడి చేయడం కోసం ఏం చేసింది? చివరకు ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.