66 dead 51 injured in hotel fire at ski resort in northwestern Turkey: మంచుతో నిండిపోయిన రిసార్టులో సేదదీరి, ఆహ్లాదంగా గడుపుదామని వచ్చారు. కానీ వారంతా మంటలకు ఆహుతి అయ్యారు. టర్కీలోని ప్రముఖ స్కీ రిసార్ట్‌లోని హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం 66 మంది మరణించారని ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మరో 51 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది.
అగ్నిప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై ఇంకా ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయలేదు.
ప్రమాదం జరిగిన తర్వాత శరవేగంగా మంటలు వ్యాప్తించాయి. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించేలోపే పెద్ద ఎత్తున పర్యాటకులు చనిపోయారు.
మంచు కురిసే సమయం కావడం.. స్కీ రిసార్టుకు మంచి పేరు ఉండటంతో ఈ సీజన్ లో పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తూంటారు. అందుకే స్కీ రిసార్టులో రూములు ఖాళీ లేకుండా పర్యాటకులు ఉన్నారు. అందూర గాఢనిద్రలో ఉన్న సమయంలో మంటలు వ్యాపించాయి. రిసార్టులోని రెస్టారెంట్ నుంచి మంటలు వచ్చాయని భావిస్తున్నారు. అక్కడే ప్రమాదవశాత్తూ మంటలు అంటుకుని ఉంటాయని కానీ ఎవరూ గమనించకపోవడంతో వేగంగా వ్యాప్తి చెందాయని అధికారవర్గాలు అంచనా వేస్తున్నారు.
మొత్తం స్కీ రిసార్టులో 250 మందికిపైగానే ఉన్నారు. అతి కష్టం మీద వంద మందికిని సురక్షితంగా బయటకు తీసుకు రాగలిగారు. అయితే అరవైఆరు మంది సజీవ దహనమయ్యారు. యాభై ఒక్క మందిని ఆస్పత్రిలో చేర్చారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన వారిలో విదేశీ పర్యాటకులు ఎంత మంది ఉన్నారన్నదానిపై ఇంకా టర్కీ ప్రకటన చేయాల్సి ఉంది.