Trump is dead Viral Posts: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరణించారని పేర్కొంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో "#TrumpIsDead" , "#TrumpDied" హ్యాష్‌ట్యాగ్‌లు వైరల్‌గా మారాయి. ట్రంప్ గత 24 గంటల్లో బహిరంగంగా కనిపించకపోవడం, ఆయన ఆరోగ్యంపై ఇటీవలి ఆందోళనలు, అలాగే ఉప రాష్ట్రపతి జేడీ వాన్స్ యొక్క ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో మరింత ఊపందుకున్నాయి. నిజానికి ట్రంప్ కు ఎలాంటి అనారోగ్యం లేదని వైట్ హౌస్ ప్రకటించింది.
ఇటీవల ట్రంప్ చేతిపై కనిపించిన గాయాలు , కాళ్లలో వాపు వంటి ఆరోగ్య సమస్యల గురించి విస్తృతంగా చర్చ జరిగింది. ట్రంప్‌కు క్రానిక్ వీనస్ ఇన్‌సఫిషియెన్సీ (సీవీఐ) అనే వ్యాధి ఉన్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది, ఇది 70 ఏళ్లు పైబడిన వ్యక్తులలో సాధారణమైన, ప్రాణాంతకం కాని వ్యాధి. అయితే ఈ వదంతులకు కారణం యూఎస్ఏ టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉప రాష్ట్రపతి జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు. వాన్స్, “ఒకవేళ దురదృష్టకరమైన ఘటన జరిగితే, నేను అధ్యక్ష పదవిని పదవిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను” అని చేసిన వ్యాఖ్యలు కూడా. అయితే ట్రంప్ “అద్భుతమైన ఆరోగ్యంతో, శక్తివంతంగా ఉన్నారు” అని కూడా స్పష్టం చేశారు.
నిజానికి చాలా మందికి ట్రంప్ అరోగ్యం బాగుందని తెలిసి కూడా పోస్టులు పెడుతున్నారు. ట్రంప్ ఈజ్ డెడ్ అనే పోస్టుకు లైక్ చేస్తే డాలర్లు ఇస్తామని పోస్టులు పెడుతున్నారు. చాలా మంది హాస్యంగా స్పందిస్తున్నారు.
ట్రంప్ విధానాలతో విసుగెత్తిపోయిన అమెరికన్లు ఇలాంటి ట్వీట్లు పెడుతున్నారు. ఆయన భేషుగ్గా ఉన్నరాని తెలిసినా.. ఇలాంటి పోస్టులు ఆగడం లేదు. కొంత మంది కామెడీగా స్పందిస్తున్నారు.
ఆయన పాలనపై ప్రజలు కూడా విసుగెత్తిపోయారని.. ఇలాంటి ట్వీట్లతో వెల్లడవుతోంది.