US President Donald Trump: అమెరికా భారతదేశంపై 50% భారీ సుంకాన్ని విధించింది, దీనివల్ల భారత ఎగుమతిదారులకు భారీ నష్టం వాటిల్లింది. నివేదిక ప్రకారం, ఈ నిర్ణయం సాధారణ వాణిజ్య విధానంలో భాగం కాదు, కానీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత అసంతృప్తి ఫలితమేనని స్పష్టం అయ్యింది. 

Continues below advertisement


అమెరికా బహుళజాతి పెట్టుబడి బ్యాంక్, ఆర్థిక సేవల సంస్థ జెఫరీస్ నివేదిక సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చింది. మే నెలలో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణలో ట్రంప్ మధ్యవర్తిత్వం వహించాలని కోరుకున్నారని పేర్కొంది. అయితే, మూడో పక్షం జోక్యాన్ని తాము అంగీకరించబోమని భారత్ స్పష్టం చేసింది. ఈ నిరాకరణ ట్రంప్‌ను ఆగ్రహానికి గురిచేసింది. ఆయన భారతదేశంపై భారీ సుంకాలు విధించాలని నిర్ణయించుకున్నారు.


నోబెల్ బహుమతిని కోరుకుంటున్న ట్రంప్!


ప్రపంచంలోని అనేక ఘర్షణలను తాను ముగించానని ట్రంప్ చాలాసార్లు పేర్కొన్నారు. ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని వైట్‌హౌస్ కూడా ఒక ప్రకటన చేసింది. ఈ విషయంపై జూలైలో ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ, అధ్యక్షుడు ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతిని ఇచ్చే సమయం ఆసన్నమైందని అన్నారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో కశ్మీర్ సమస్యకు వెయ్యేళ్ల నాటి పరిష్కారాన్ని తాను కనుగొనగలనని కూడా రాశారు. అయితే, భారతదేశం తిరస్కరించడంతో ఈ ఆకాంక్షకు ఎదురుదెబ్బ తగిలింది.


US ఆర్థికమంత్రి భారతదేశాన్ని మొండిగా అభివర్ణించారు


భారతదేశం తన వ్యవసాయ రంగాన్ని దిగుమతుల కోసం తెరవాలని అమెరికా కోరుకుంటుందని నివేదిక పేర్కొంది. రైతుల ప్రయోజనాలను కాపాడటానికి భారత్ అలా చేయడానికి నిరాకరించింది. భారతదేశంలో దాదాపు 25 కోట్ల మంది రైతులు, కార్మికులు తమ జీవనోపాధి కోసం వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు, ఎందుకంటే మొత్తం శ్రామికశక్తిలో 40% మంది వ్యవసాయంలో ఉన్నారు. దీని కారణంగా, అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బేసెంట్ భారతదేశాన్ని మొండి ఘటనంగా అభివర్ణించారు.


ట్రంప్ సుంకాలపై భారతదేశ ప్రతిస్పందన


అమెరికా చర్య అన్యాయమని, సముచితం కాదని భారత్ పేర్కొంది. ఈ వైఖరి తమను చైనాకు దగ్గర చేస్తుందని భారత్ హెచ్చరించింది. ముఖ్యంగా సెప్టెంబర్ నుంచి ఐదు సంవత్సరాల తర్వాత భారత్- చైనా మధ్య నేరుగా చర్చలు జరుగుతున్నాయి.