Ivana Trump Passed Away: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ (73) కన్నుమూశారు. అయితే ఈ విషయాన్ని నేరుగా డొనాల్డ్ ట్రంప్ యే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విషయాన్ని తెలిపారు. న్యూయార్క్ నగంలో మాన్ హట్టన్ ఇంట్లో ఆమె మరణించినట్లు గురువారం పోస్టు పెట్టారు. ఇవానా అందమైన, అద్భుతమైన మహిల అని ఆమె అందిరకీ ఆదర్శంగా నిలిచే జీవితాన్ని గడిపిందంటూ ట్రంప్ తన పోస్టులో రాసుకొచ్చాడు.
ఇది చాలా విచారకరమైన రోజని ఎరిక్ ట్రంప్ తెలిపారు. తన తల్లి ఇవానా ట్రంప్ తో కలిసి నవ్వుతూ ఉన్న చిన్నప్పటి ఫొటోలను ఇవాంకా ట్రంప్ తన సోషీల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేసింది. తన తల్లి తెలివైన, ఉద్యోగభరితమైన, మనోహరమైన మహిళని అభివర్ణించింది. అవానా ట్రంప్ జీవితంలో పోరాడిందని కమ్యూనిజం నుంచి ఆమె తప్పించుకొని అమెరికా దేశ పురోగతికి దోహదపడిందంటూ ఇవాంకా ట్రంప్ రాసుకొచ్చింది.
ఇవానా ఎలా చనిపోయింది..?
కాగా ఇవానా ట్రంప్ తన ఇంట్లోని మెట్ల దగ్గర అపస్మారక స్థితిలో కనిపించిందని... మెట్ల పైనుంచి పడిపోయి ప్రమాదవశాత్తు ఆమె మరిణించిందా లేదా అనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఆ ఇంట్లో పని చేసే వ్యక్తులు చెబుతున్నారు. అయితే మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం ఆమె మరణానికి సరైన కారణం ఏంటో తెలియజేస్తుందని ఇవానా కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇవానా ట్రంప్ మృతితో డొనాల్డ్ ట్రంప్ ఇంట విషాధం నెలకొంది.
ఇవానాకు నాలుగు పెళ్లిళ్లు.. ట్రంప్ రెండో భర్త!
ఇవానా మేరీ ట్రంప్ ఫిబ్రవరి 20వ తేదీ 1949లో జన్మించింది. ఈమె ప్రముఖ వ్యాపారవేత్తగా, మోడల్ గా మంచి పేరు పొందింది. అయితే ఇవానా ఇప్పటి వరకు నాలుగు పెళ్లిళ్లు చేస్కున్నారు. 1971లో ఆల్ర్పెడ్ వింక్ల్ మైర్ ని పెళ్లి చేస్కొని.. 1973లో విడాకులు తీస్కున్నారు. ఆ తర్వాత 1977లో డొనాల్డ్ ట్రంప్ ని వివాహం చేసుకుంది. చాలా ఏళ్ల పాటు హాయిగా సాగిన వీరి కాపురానికి గుర్తుగా ముగ్గురు పిల్లలు పుట్టారు. వారే డొనాల్డ్ జూనియర్, ఇవాంకా ట్రంప్, ఎరిక్. కానీ కొన్ని కారణాల వల్ల 1991లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.
సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్ కూడా..
ఆ తర్వాత 1995లో రికార్డో మజ్జుచెల్లిని పెళ్లాడి రెండేళ్లకే గుడ్ బై చెప్పేశారు. ఆ తర్వాత 2008లో రొస్సానో రూబికొండని పెళ్లి చేస్కున్నారు. తర్వాత ఏడాదికే విడాకులు తీసుకున్నారు. అయితే ఇవానా డొనాల్డ్ ట్రంప్ తోనే ఎక్కువ కాలం బాంధవ్య జీవితాన్ని గడిపింది. అయితే ఇవానా డొనాల్డ్ ట్రంప్ భార్య మాత్రమే కాదండోయ్.. సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్ కూడా. 1980వ దశకంలో మీడియాలో ట్రంప్ కు క్రేజ్ పెరగడానికి ఈమెనే కారణం. ఆమె వల్లనే న్యూయార్క్ సిటీలో పవర్ కపుల్స్ గా వీరి జంటకు పేరొచ్చింది. అయితే ఆమె తన 71 ఏళ్ల వయసులో అంటే నిన్న మృతి చెందింది.