ఇండోనేషియాలోని బాలి సముద్ర ప్రాంతంలో భూకంపం ఏర్పడింది. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) నివేదిక ప్రకారం ఇది రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో ఏర్పడింది. యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) దీని తీవ్రత 7.1గా నమోదు చేసింది. 


భూకంప కేంద్రం ఇండోనేషియాలోని మాతరానికి ఉత్తరంగా 201 కిలోమీటర్లు, భూమి ఉపరితలం నుంచి 518 కిలోమీటర్లు (322 మైళ్ళు) లోతులో ఉందని EMSC తెలిపింది. 


ఇండోనేషియాలోని వెస్ట్ నుసా టెంగ్‌గారాలోని బంగ్సాల్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. భూకంప కేంద్రం కింద 525 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. 


సముద్రగర్భంలో చాలా లోతులో ఈ భూకంపం ఏర్పడినందున సునామీ హెచ్చరికలేమీ లేవని యుఎస్ సునామీ హెచ్చరిక వ్యవస్థ తెలిపింది.