భారత సైన్యంలో మహిళలకు సముచిత స్థానం కల్పించనున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. త్వరలోనే మహిళా అధికారులు సైన్యాన్ని నడిపించే స్థాయిలో ఉంటారని, బెటాలియన్లకు నాయకత్వం వహిస్తారని వెల్లడించారు.
పోలీసు, కేంద్ర బలగాలు, పారామిలటరీ, సైన్యం ఇలా అన్నింట్లో మహిళల ప్రాతినిథ్యం పెరిగేందుకు మేం కృషి చేస్తున్నాం. పురుషులతో సమానంగా త్వరలోనే మహిళలు సైన్యంలో పనిచేస్తారు. సైన్యంలో అత్యధిక ర్యాంకుల్లో కూడా మహిళలు ఉంటారు.
రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి
ఈ మేరకు షాంఘై సహకార సదస్సుకు సంబంధించిన వెబినార్‌లో సైన్యంలో మహిళల పాత్రపై రాజ్‌నాథ్ ప్రసంగించారు. దేశాన్ని పాలించిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ను ఈ సందర్భంగా రాజ్‌నాథ్ గుర్తుచేశారు. దేశాన్ని పాలించడానికే కాదని సైన్యాన్ని నడిపించే స్థాయికి కూడా మహిళలు ఎదుగుతారని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
ఇటీవల ఆర్మీలో..
పురుషులకే కొన్ని ఉద్యోగాలు పరిమితమన్న ఆంక్షల చట్రాలను బద్ధలు కొడుతూ వంద మంది మహిళా సిపాయిలు ఇటీవల సైన్యంలో చేరారు. నైతిక బలమే ప్రామాణికమైతే మగవారికన్నా స్త్రీ లే అత్యంత శక్తి సంపన్నులన్న మహాత్మా గాంధీ వాక్కును నిజం చేశారు. వంద మంది యువతులు 2021 మే 8న ఆర్మీలో చేరనున్నారు. కార్ప్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్(సీఎంపీ)లో వీరు జవాన్లుగా బాధ్యతలు స్వీకరించారు.
కఠిన శిక్షణ..
సీఎంపీలో వంద జవాన్ పోస్టులకు గత ఏడాది నోటిఫికేషన్ ఇవ్వగా దాదాపు 2 లక్షల మంది యువతులు దరఖాస్తు చేశారు. ఈ సంఖ్యను చూసి సైన్యాధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అందులో 17 రాష్ట్రాలకు చెందిన వంద మందిని ఎంపిక చేసి, వారికి పురుషులతో సమానంగా కఠిన శిక్షణ ఇచ్చారు. యువతుల కోసం ప్రత్యేకంగా శిక్షణా మ్యాన్యువల్‌ను రూపొందించలేదని పురుషులకు ఇచ్చిన శిక్షణనే వారికి ఇచ్చినట్లు శిక్షణాధికారి లెఫ్టినెంట్ కర్నల్ జూలీ వెల్లడించారు. 61 వారాలపాటు సాగిన కఠిన శిక్షణను పూర్తి చేసి, అన్ని విభాగాల్లోనూ సత్తా చాటిన వంద మంది యువతులు దేశ రక్షణను స్వీకరించారు.
Also Read: Varun Gandhi Tweet on Farmers: వాజ్‌పేయీ మాటలతో మోదీ సర్కార్‌కు వరుణ్ గాంధీ చురకలు
Also Read: Amit Shah on Pakistan: 'పాక్.. జాగ్రత్త!.. మితిమీరితే ఇక చర్చలు ఉండవు.. మెరుపుదాడులే'
Also Read: Mumbai Cruise Drug Case: ఆర్యన్ ఖాన్‌తో ఉన్నది ఎవరు?.. వైరల్ సెల్ఫీలో వ్యక్తిపై లుక్ఔట్ నోటీసు!
Also Read: రోజుకి ఎన్ని అడుగులు వేస్తే మంచిది? అసలు ఎన్ని అడుగులు వేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం