సినిమాల ఫలితాలెలా ఉన్నా వరుస ప్రాజెక్టులతో వచ్చేస్తున్నాడు న్యాచురల్ స్టార నాని. కరోనా ఫస్ట్ వేవ్ టైంలో 'వి' సినిమాతో డైరెక్ట్ ఓటీటీలో వచ్చిన నాని...గత నెలలో ' టక్ జగదీష్' అంటూ మళ్లీ ఓటీటీలో పలకరించాడు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కి సంబంధించి చాలా హడావుడి జరిగింది. అదంతా పక్కనపెడితే నాని లేటెస్ట్ మూవీ 'శ్యామ్ సింగరాయ్'. విజయ దశమి సందర్భంగా ఈసినిమా నుంచి నాని ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.
ఇప్పటికే వదిలిన నాని ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. తాజా వీడియోలో కాళీ మాత ఆలయంలో శ్యామ్ సింగ రాయ్ ని చూపిస్తూ.. కాళీ మాత పోస్టర్ నుంచి వాసు లుక్ ని రివీల్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ కి మిక్కీ జె మేయర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ఇక హీరోయిన్స్ సాయి పల్లవి, కృతి శెట్టిల పాత్రలను రివీల్ చేస్తూ గతంలో వదిలిన పోస్టర్లు అదుర్స్ అనిపించాయి. నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకి 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇది నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.
కోల్ కత్తా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజులు కోల్ కత్తాలో జరిపారు. కరోనా సెకండ్ వేవ్ రావడంతో హైదరాబాద్ లోనే కోల్ కత్తా సెట్ వేసి షూటింగ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న 'శ్యామ్ సింగరాయ్' ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.ఈసారి థియేటర్లలోనే పక్కా అంటూ క్లారిటీ ఇచ్చిన మేకర్స్ ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Also Read: 'అంత ఇష్టం ఏందయ్యా' పవన్ ని ఓరగా చూస్తోన్న నిత్యామీనన్
Also Read:దండుపాళ్యం' గ్యాంగ్ తో 'తగ్గేదే లే'..వరుస మర్డర్స్, నో ఎవిడెన్స్
Also Read: పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా డార్లింగ్ …ఖాకీ డ్రెస్ లో ప్రభాస్ కటౌట్ చూస్తే..
Also Read: శరన్నవరాత్రుల్లో చివరి మూడు రోజులు ఎందుకంత ప్రత్యేకం, దశమి రోజు ఈ శ్లోకం రాసి జమ్మిచెట్టుకి కడితే…
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి