మూడు భాగాలుగా వచ్చిన 'దండుపాళ్యం' గ్యాంగ్  అరాచకాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ వర్గం ప్రేక్షకులు వీటిని బాగా ఫాలోఅయ్యారు.  దొంగతనాలు,  దోపిడీలు, హత్యలు వామ్మో సినిమా మొదట్నుంచి చివరి వరకూ రక్తం చిందించారు. ఇప్పుడు దండుపాళ్యం అనే టైటిల్ పక్కన పెట్టి ఈ సారి  'తగ్గేదే లే'  అని ఫిక్సయ్యారు.  'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన ఈ డైలాగ్ పాపులర్ కావడంతో పాటూ దండుపాళ్యం టీమ్ కనిపించడంతో తాజాగా విడుదల చేసిన  టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. 



 'దండుపాళ్యం' గ్యాంగ్ ని ఇందులో ఇన్వాల్వ్ చేశారు. ఓ మర్డర్ మిస్టరీని చేధించే క్రమంలో చోటు చేసుకునే పరిణామాలను చూపించారు. రొమాన్స్ ను టచ్ చేస్తూ సాగే ఈ  క్రైమ్ కథకు శ్రీనివాసరాజు దర్శకుడు. భద్ర ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రేమ్ కుమార్ పాండే - పీవీ సుబ్బారెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రెండు రోజుల క్రితం విడుదల చేశారు.  ఇంత పెద్ద బ్యానర్‌లో తనను దర్శకుడిగా తీసుకున్నందుకు నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు దర్శకుడు శ్రీనివాసరాజు.  మన చరిత్రలో ఎన్నెన్నో కథలున్నాయి. ఇలాంటి కథల్ని ప్రేక్షకులకు చెప్పేందుకే ఈ భద్ర ప్రొడక్షన్‌ ప్రారంభించాం అన్నారు నిర్మాతలు. 'తగ్గేదే లే'  విభిన్నమైన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మాత్రమే కాదు మంచి ప్రేమ కథ కూడా అన్నారు నటుడు  రాజా రవీంద్ర.  చరణ్ అర్జున్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. చిన్నా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ,అనన్య సేన్ గుప్తా, రవి శంకర్, రాజా రవీందర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.  ఈ మధ్య విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. 
Also Read: హౌస్‌మేట్స్‌కు షాకిచ్చిన బిగ్‌బాస్... ఆ చిన్న తప్పు కారణంగా ఈ వారం హౌస్‌కి కెప్టెన్ లేనట్టేనా?
Alos Read: రజినీకాంత్ కు బయ్యర్ దొరికేశాడు.. 'అన్నాత్తే' తెలుగు రైట్స్ ఎంతో తెలుసా..
Also Read: యానీ మాస్టర్ తో ఫైట్.. పిల్లో అడ్డం పెట్టుకొని ఏడ్చేసిన శ్వేతా..
Also Read:  విలియం శాట్నర్ సరికొత్త చరిత్ర.. అంతరిక్షంలోకి వెళ్లిన అతిపెద్ద వయస్కుడిగా నటుడు రికార్డ్
Also Read: శరన్నవరాత్రుల్లో చివరి మూడు రోజులు ఎందుకంత ప్రత్యేకం, దశమి రోజు ఈ శ్లోకం రాసి జమ్మిచెట్టుకి కడితే…
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి