సూపర్ స్టార్ రజినీకాంత్-దర్శకుడు శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ సినిమా 'అన్నాత్తే'. ఈ సినిమాకి కోలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. సినిమాలో రజినీకాంత్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సాధారణంగా రజినీకాంత్ సినిమాలన్నీ తెలుగులో కూడా రిలీజ్ అవుతుంటాయి. కానీ ఈ సినిమాకి తెలుగులో బయ్యర్ దొరకడం చాలా కష్టమైంది. ఎందుకంటే రజినీకాంత్ నటించిన 'దర్బార్', 'పేట', 'కాలా' లాంటి సినిమాలు తెలుగులో డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో 'అన్నాత్తే' సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి ఎవరూ ముందుకురాలేదు. 

 


 

కానీ ఫైనల్ గా ఈ సినిమా తెలుగు హక్కులను నారాయణ్ దాస్ నారంగ్, దగ్గుబాటి సురేష్ బాబు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం మొత్తం రూ.12 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అంతేకాదు.. తెలుగులో ఈ సినిమాకి 'పెద్దన్న' అనే టైటిల్ పెట్టాలని భావిస్తున్నారట. దీపావళి కానుకగా నవంబర్ 4న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా విడుదల కానుంది. 

 

ఇప్పటివరకు అయితే తెలుగులో దీపావళికి పెద్ద సినిమాలేవీ లేవు. కాబట్టి ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. త్వరలోనే ఈ సినిమా తెలుగు పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా అన్నాచెల్లెళ్ల అనుబంధం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. రజినీకాంత్ సోదరిగా కీర్తి సురేష్ కనిపించనుంది. ఇక రజినీకాంత్ కి జోడీగా నయనతార నటిస్తోంది. మీనా, కుష్బూ లాంటి పేరున్న నటీనటులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.