జమ్ముకశ్మీర్​ వరుస ఎన్‌కౌంటర్‌లతో అట్టుడుకుతోంది. పుల్వామా ​జిల్లా అవంతిపోరాలోని త్రాల్​ ప్రాంతంలో ఈరోజు ఎన్​కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ​కు చెందిన టాప్​ కమాండర్ షామ్ సోఫీని ​బలగాలు మట్టుబెట్టాయి. ఈ మేరకు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్​ తెలిపారు. 






ముష్కరులు ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు గాలించాయి. భద్రతా దళాలను చూసి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి.


ఐదుగురు ఉగ్రవాదులు..


పండుగలు రానున్న వేళ దిల్లీ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో దాడులు చేసేందుకు కుట్ర పన్నిన వివిధ తీవ్రవాద గ్రూపులకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) అదుపులోకి తీసుకుంది.


శ్రీనగర్, పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో ఏకకాలంలో మంగళవారం నిర్వహించిన సోదాల్లో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎన్​ఐఏ అధికారులు తెలిపారు.






ముష్కరుల కార్యకలాపాల్లో సహకరిస్తూ వారికి అవసరమైన సరకు రవాణాలో వీరు మద్దతిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు ఎన్ఐఏ తెలిపింది.


Also Read: Malabar Maritime Exercise Pics: చైనాకు భారత్ చెక్.. 'ఆపరేషన్ మలబార్‌'తో డ్రాగన్ గుండెల్లో గుబులు


Also Read: Corona Cases: గత 19 రోజులుగా 30 వేలకు దిగువనే కరోనా కేసులు


Also Read: GatiShakti Launch: రూ.100 లక్షల కోట్లతో 'పీఎం గతి శక్తి'కి మోదీ శ్రీకారం.. ప్రతిపక్షాలపై తనదైన శైలిలో సెటైర్లు


Also Read:Lakhimpur Violence: రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ బృందం.. ఇదే ప్రధాన డిమాండ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి