తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం దక్కింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలు, దేశాల నుంచి ఆహ్వానం అందుకున్న మంత్రి.. తమ సెనేట్‌లో జరిగే సమావేశంలో పాల్గొనాల్సిందిగా ఫ్రెంచ్ ప్రభుత్వం కోరింది. అక్టోబర్ 29న తమ సెనేట్‌లో జరిగే ఆంబిషన్ ఇండియా బిజినెస్ ఫోరం సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొని ప్రసంగించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేటీఆర్‌కు ఆహ్వాన లేఖను పంపింది. ఫ్రెంచ్ ప్రధానమంత్రి ఇమాన్యూల్ మాక్రోన్ సారథ్యంలో ఏర్పాటైన ఈ సదస్సు.. భారత్, ఫ్రెంచ్ దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాల బలోపేతానికి దోహదపడుతుందని లేఖలో పేర్కొంది. ఆంబిషన్ ఇండియా 2021 సదస్సులో కీనోట్ స్పీకరుగా 'గ్రోత్ - డ్రాఫ్టింగ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండో ఫ్రెంచ్ రిలేషన్స్ ఇన్ పోస్ట్ కోవిడ్ ఎరా' అనే అంశంపై అభిప్రాయాలు పంచుకోవాలని కేటీఆర్‌ను కోరింది. 


Also Read: తెలంగాణ వర్సిటీలో ఔట్ సోర్సింగ్ నియామకాలపై రచ్చ.. అక్రమాలు జరిగాయంటున్న విద్యార్థి సంఘాలు.. 


వ్యాపార అవకాశాలకు ఛాన్స్.. 
గతంలో నిర్వహించిన ఆంబిషన్ ఇండియా సదస్సులో సుమారు 700 మంది వ్యాపార, వాణిజ్య భాగస్వాములు.. 400కు పైగా ఇరు దేశాల కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారని లేఖలో పేర్కొంది. ఈసారి అంతకుమించి కంపెనీల భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నామని చెప్పింది. ఇలాంటి కీలకమైన వేదిక తెలంగాణలో ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాలను పరిచయం చేసేందుకు ఉపయుక్తంగా ఉంటుందని అభిప్రాయపడింది. ఈ సదస్సులో హెల్త్ కేర్, వాతావరణ మార్పులు, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఆగ్రో బిజినెస్ వంటి అంశాలపైన ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేశామని పేర్కొంది. దీంతో పాటు ఫ్రెంచ్, భారత్ కంపెనీల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు ఉంటాయని మంత్రికి పంపిన ఆహ్వాన లేఖలో ప్రస్తావించింది. 


Also Read: రంగంలోకి దిగితే బట్టలూడదీసి కొడతాం.. రేవంత్‌కు టీఆర్ఎస్ నేతల హెచ్చరిక !


మంత్రి కేటీఆర్ హర్షం.. 
ఫ్రెంచ్ దేశ ఆహ్వానం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను పరిచయం చేసే అవకాశం కలుగుతుందని తెలిపారు. ఫ్రెంచ్ ఆహ్వానం తెలంగాణ ప్రభుత్వ విధానాలను దక్కిన గుర్తింపుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. 


Also Read: పండక్కి ఊరెళ్తున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే.. పోలీసులు హెచ్చరిక 


Also Read: హుజురాబాద్‌లో 30, బద్వేలులో 15 మంది ! ఉపఎన్నికల్లో అభ్యర్థుల తుది జాబితా ఖరారు ! 



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి