పవన్ కల్యాణ్ , రానా దగ్గుబాటి మల్టీస్టారర్ మూవీ ''భీమ్లా నాయక్''. ఇందులో పవన్ భార్యగా నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఇప్పటి వరకు మూ సినిమా నుంచి విడుదలైన ఇద్దరు హీరోల గ్లిమ్స్ - ఫస్ట్ సింగిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా 'అంత ఇష్టం' అనే మరో పాట రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న మూవీ యూనిట్ తాజాగా ఈ సాంగ్ ప్రోమో విడుదల చేశారు.
”అంట ఇష్టమేందయ్యా.. అంత ఇష్టమేందయ్యా.. నీకు.. నా మీనా” అంటూ ఈ పాట సాగుతోంది. రామ జోగయ్య శాస్త్రి రాసిని ఈ పాటకు ఎస్ఎస్ థమన్ స్వరాలు సమకూర్చగా కేఎస్ చిత్ర ఆలపించారు. విజయ దశమి సందర్భంగా శుక్రవారం ఉదయం 10.19 గంటలకు 'అంత ఇష్టం' పూర్తి లిరికల్ వీడియోని విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.