అతనో ప్రభుత్వ ఉద్యోగి.. వచ్చే నవంబర్ లో పదవీ విరమణ చేయబోతున్నాడు. చూడడానికి పెద్ద మనిషి లాగా ఉంటాడు. కానీ చేసేవన్నీ చిల్లర పనులు. యువతులను టార్గెట్ చేసి వేధిస్తున్నాడు ఈ కామాంధుడు. మహిళలు, యువతుల అవసరాలను ఆసరాగా చేసుకుని మాటామాటా కలపడం, ఫోన్ నెంబర్లు తీసుకుని వారి బలహీనతలతో ఆడుకుంటున్నాడు. బాధ్యత గల ఉద్యోగం చేస్తూ ఇలాంటి పాడు పనులు చేస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ వర్క్ ఇన్స్పెక్టర్ మాధవరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
ఆర్థిక అవసరాల తీరుస్తానని మహిళలకు వల
అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో వర్క్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్నాడు మాధవరెడ్డి. ఇతను ఈ ఏడాది నవంబర్ లో పదవీ విరమణ చేయబోతున్నాడు. అయితే ఈ వయసుతో కూడా పాడు బుద్ధితో మహిళలు, యువతులను టార్గెట్ చేసి వేధిస్తున్నాడు. మహిళలకు మాయమాటలు చెప్పి వారి ఆర్థిక అవసరాలను తీరుస్తానంటూ వారిని లొంగదీసుకోవడం ఇతని ప్రవృత్తి. దిశ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళతో పరిచయం పెంచుకొని ఆమెను డ్రాప్ చేస్తానని స్కూటీలో ఎక్కించుకున్నాడు మాధవరెడ్డి. అనంతపురం పట్టణ శివారుకు తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నించాడు. మహిళ నిరాకరించే సరికి బలవంతంగా లాక్కెళ్లేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యాడు. దీంతో మాధవరెడ్డి లీలలు బయటికి వచ్చాయి.
Also Read: బీజేపీ నేత అక్రమ సంబంధం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఫ్యామిలీ.. చెప్పులతో దాడి
యువతులే టార్గెట్
కాలేజీకి వచ్చే యువతులే ఈయన టార్గెట్. తాత లాంటి వాడు అని నమ్మి ఇతనితో సరదాగా మాట్లాడే యువతులను మాయమాటలు చెప్పి మోసగించడం, శారీరకంగా వాడుకోవడం, అవసరం తీరాక బ్రోకర్ అవతారం ఎత్తి ఇతరుల వద్దకు పంపడం చేస్తున్న మాధవరెడ్డిని కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ తెలిపారు. ఇతని చేతిలో ఇంకా ఎవరైనా మోసపోయి ఉంటే అటువంటి వారి వివరాలు తన దృష్టికి తీసుకురావాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ కామాంధుడి పై గతంలో వ్యభిచార కేసు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే విధినిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడినందుకు రెండు సార్లు సస్పెన్షన్ కు గురైనట్లు కూడా పోలీసు విచారణలో తెలిసిందని డీఎస్పీ వెల్లడించారు.
Also Read: అన్నాదమ్ముళ్ల పాడు పని.. మహిళ స్నానం చేస్తుండగా వీడియోలు, అంతటితో ఆగకుండా..
15 రోజుల రిమాండ్
ఈ ఏడాది నవంబర్ నెలలో రిటైర్మెంట్ కావాల్సిన వయసులో కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఒక యువతికి తన ద్విచక్ర వాహనంపై లిఫ్ట్ ఇస్తానని చెప్పి నమ్మించి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బలవంతం చేసేందుకు ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించింది. దిశ పోలీసులకు సమాచారం ఇచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన దిశ పోలీసులు.. మాధవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా గతంలో ఉన్న కేసులు, ఇతని వ్యవహార శైలి వెలుగు చూసినట్లు డీఎస్పీ తెలిపారు. మాధవ్ రెడ్డికి కోర్టు 15 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: చిత్తూరు జిల్లాలో దారుణం.. పండుగకు అమ్మమ్మ ఇంటికి వెళ్లిన బాలుడు కిడ్నాప్, బొప్పాయి తోటలో శవమై!