ఆహ్వానం అనే తెలుగు సినిమాను చూశారా ? అందులో పెళ్లి లాగే విడాకులకూ ఓ వేడుక చేయడం కాన్సెప్ట్. చివరికి విడాకులు కోరుకున్న భర్త ఆ వేడుకలో పశ్చాత్తాపం పొందుతాడు. అది హ్యాపీ ఎండింగ్ ఆ సినిమాకు. కానీ అలా పశ్చాత్తాపం పొందకుండా ఉండటం నేటి హ్యాపీ ఎండింగ్. నిజంగా ఇలాంటి వేడుకలు ఇప్పుడు జరుగుతున్నాయి. లండన్‌లో జరిగిన ఇలాంటి ఓ విడాకుల పార్టీ ఇప్పుడు వైరల్ అయింది. ఇలా చేసుకుంది విదేశాల్లో పుట్టి పెరిగి.. అక్కడి సంస్కృతికి అలవాటు పడిన వారు కాదు. ఇండియన్ మహిళే.
లండన్‌లో నివసిస్తున్న భారతీయ మహిళ సోనియా గుప్తా ఇటీవల గ్రాండ్ పార్టీ ఇచ్చింది. ఆ పార్టీ దేనికంటే ఆమెకు ఎట్టకేలకు విడాకులు మంజూరైనందుకట. పదిహేడేళ్ల పాటు వైవాహిక బంధంలో ఉన్న ఆమె ఆ బంధం నుంచి బయటపడాలని ప్రయత్నించి ఇప్పటికి సక్సెస్ అయిందట. అందుకే సంతోషంతో అందర్నీ పిలిచి పార్టీ ఇచ్చింది. పైన చెప్పుకున్నట్లు ఎక్కడ భర్త మనసు మార్చుకుని మళ్లీ నీతోనే ఉంటాను అని లొల్లి చేస్తాడేమో కానీ ఆ పార్టీకి అప్పటికే విడాకులు ఇచ్చిన భర్తను ఆహ్వానించలేదు. వారి కుటుంబసభ్యులను కూడా పిలువలలేదు. కానీ లైక్ మైండెడ్ మైండ్ సెట్ ఉన్న ఫ్రెండ్సందరినీ పిలిచి పార్టీని లగ్జరీగా ఇచ్చింది.
Also Read : రష్యాలోని అత్యున్నత శిఖరంపై చంద్రుడి తేజం భువన్ జై
ఇంతకీ సోనియా గుప్తా ఎందుకు విడిపోవాలనుకున్నారు అంటే.. ఆమెకు ఫ్యామిలీ లైఫ్ నచ్చదట. స్వతంత్రంగా బతకాలని ఉండేదట. కానీ పెళ్లి తర్వాత ఆమె ఎంత గింజుకున్నా బయటకు రాలేకపోయిందట. భార్యభర్తల మధ్య బంధం పెద్దగా బలపడలేదు. కెరీర్ అంటూ భర్త బయటకు పరుగులు తీస్తూంటే ఇంట్లో జనం ఉన్న ఒంటరిగా బాధపడేదట. అప్పుడే డైవోర్స్ తీసుకుందామనుకున్నా... కుటుంబ పరువు, ప్రతిష్టల పేరుతో ఇంత కాలం ఆగాల్సి వచ్చింది. చివరికి ఇప్పుడు ఆమె ధైర్యం చేసింది. మూడేళ్ల నుంచి విడాకుల కోసం సుదీర్ఘ పోరాటం చేసింది. చివరికి 17 ఏళ్ల వైవాహిక బంధం నుంచి విముక్తి లభించింది.
Also Read : 'ప్లీజ్.. ఒక్క అవకాశం ఇవ్వండి'.. ఐరాసకు తాలిబన్ల లేఖ
విడాకులు వచ్చిన సందర్భంగా సోనియా గుప్తా తన లండన్ నివాసంలో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసింది. ఇక స్నేహితులతో కలిసి తన సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంది. ఆమె ధరించిన డ్రెస్ మీద ఫైనల్లీ డివోర్స్‌డ్ అనే ట్యాగ్ ధరించింది. స్నేహితులను కూడా మంచి దుస్తులు ధరించి వచ్చేలా ప్రోత్సాహించారు. తన జీవితంలోకి సంతోషం తిరిగి వచ్చిందని అందుకే వేడుకలు చేసుకుంటున్నానని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఈ విడాకుల పార్టీ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.