Viral News: నిద్రపోయే సమయంలో మొబైల్ ఫోన్‌ను తల దగ్గర పెట్టుకోవడం చాలా ప్రమాదమని నిపుణులు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. అయితే చాలా మంది ఈ తప్పు చేస్తూనే ఉంటారు. తాజాగా దిల్లీలో అలా చేయడమే ఓ మహిళ ప్రాణాలు తీసుకుంది.
ఇదీ జరిగింది
దిల్లీలో ఓ మహిళ రెడ్‌మీ 6ఏ మొబైల్ వాడుతోంది. ఎప్పటిలానే రాత్రిపూట ఫోన్ వాడిన ఆమె దాన్ని తల దగ్గర దిండు పక్కనే పెట్టుకొని పడుకుంది. అర్ధరాత్రి సమయంలో ఆ మొబైల్ పేలిపోయింది. దీంతో తలకు తీవ్రమైన గాయమై విపరీతంగా రక్తం పోయి ఆమె మృతి చెందింది. ఆమె కుమారుడు ఆర్మీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలను ఎండీ టాక్ అనే యూట్యూబ్ ఛానల్ నడిపే మంజీత్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు.
నెటిజన్ల ఫైర్
ఈ ట్వీట్‌లో మొబైల్ ఫోన్ ఫొటోలు షేర్ చేశాడు. వీటితో పాటు రక్తపు మడుగులో ఉన్న మహిళ ఫొటో కూడా షేర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు రెడ్‌మీ పై మండిపడుతున్నారు. సదరు కుటుంబానికి సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు రెడ్‌మీ కంపెనీ తెలిపింది.
గతంలో
రెండేళ్ల క్రితం కేరళలో ఇలాంటి ఘటనే జరిగింది. కొల్లాంకి చెందిన ఓ వ్యక్తి తన ఫోనును దిండు కింద పెట్టుకుని నిద్రించాడు. అది ఒక్కసారిగా పేలడంతో అతడి భుజం, ఎడమ చేతికి గాయాలయ్యాయి. డ్యూటీ చేసి ఇంటికి వచ్చిన తాను బాగా అలసిపోవడంతో వెంటనే నిద్రలోకి జారుకున్నానని, ఒక్కసారిగా శబ్దం రావడంతో ఉలిక్కి పడి లేచే సమయంలో భుజం ఒక్కసారిగా నొప్పి చేసిందని, దిండు కాలిపోతూ, ఫోన్ నుండి నిప్పులు చెలరేగాయని బాధితుడు చెప్పాడు.
Also Read: Bihar News: అడ్మిట్ కార్డులపై ధోని, ప్రధాని మోదీ ఫొటోలు!
Also Read: Ghulam Nabi Azad: కొత్త పార్టీ ఏర్పాటుపై ఆజాద్ కీలక ప్రకటన!