Why Bharat Bandh: దేశవ్యాప్తంగా ఇవాళ (ఆగస్టు 21) భారత్ బంద్ కొనసాగుతోంది. Reservation Bachao Sangharsh Samiti ఈ బంద్‌కి పిలుపునిచ్చింది. ఇప్పటికే ఈ ఎఫెక్ట్ పలు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. పోలీసులు,నిరసనకారుల మధ్య పలు చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయియ. అత్యవసర సేవలు మాత్రమే ఇవాళ పని చేయనున్నాయి. హాస్పిటల్స్, ఆంబులెన్స్‌లు, ఫార్మసీలు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు పోలీస్ సర్వీస్‌లూ అందుబాటులోనే ఉంటాయి. ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లైకి ఎలాంటి అంతరాయం కలగదు. ఇక బ్యాంక్‌లూ తెరిచే ఉంటాయి. అయితే..ఈ బంద్ ప్రభావం ఎక్కువగా రాజస్థాన్‌లో కనిపిస్తోంది. ఇప్పటికే అక్కడ పలు చోట్ల స్కూల్స్ మూసేశారు. మిగతా చోట్ల విద్యాసంస్థలు యథావిధిగా నడుస్తున్నాయి.
ఇంతకీ బంద్ ఎందుకు..?
ఎస్‌సీ, ఎస్టీ రిజర్వేషన్‌లపై ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. సబ్ కేటగిరీలు చేర్చుకోవచ్చని, అవసరమైన వాళ్లందరికీ ఈ రిజర్వేషన్ ఫలాలు అందాలని తేల్చి చెప్పింది. వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నో రోజులుగా దీనిపై పోరాటం జరుగుతుండగా ఇన్నాళ్లకు ఆ వర్గానికి సానుకూలంగా తీర్పు వచ్చింది. అయితే..ఈ తీర్పుని విభేదిస్తున్న వాళ్లూ ఉన్నారు. దళితులు, ఆదివాసీలు పెద్ద ఎత్తున ఈ తీర్పుని వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా రాజస్థాన్‌లో ఈ వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోంది. భారత్ బంద్‌కి అక్కడి వర్గాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఆగస్టు 1వ తేదీన వచ్చిన తీర్పు తమకు ఏ మాత్రం నచ్చలేదని, అంతకు ముందున్న రిజర్వేషన్ విధానాన్నే కొనసాగించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇప్పటికే ఈ ఆందోళనలకు మద్దతునిచ్చారు. ఝార్ఖండ్ ముక్తి మోర్ఛతో పాటు కాంగ్రెస్,RJD కూడా మద్దతు ప్రకటించాయి. ఈ ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని భద్రతను భారీగా పెంచారు. పలు చోట్ల పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు. యూపీ, ఝార్ఖండ్, రాజస్థాన్‌లో భద్రత పటిష్ఠం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. (Also Read: Badlapur: టాయిలెట్‌లో చిన్నారులను లైంగికంగా వేధించిన స్వీపర్, ఎవరూ లేని సమయంలో దారుణం - బాలల హక్కుల సంఘం విచారణ)
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి..?
ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు రాష్ట్రాలకు అధికారం కల్పిస్తూ తీర్పు ఇచ్చింది. విద్య, ఉద్యోగాల్లో వర్గీకరణ చేసేందుకు అనుమతినిచ్చింది. CJI డీవై చంద్రచూడ్ నేతృత్వంలోనే ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. అయితే..వీరిలో ఆరుగురు వర్గీకరణకు మొగ్గు చూపగా ఒకరు మాత్రం వ్యతిరేకించారు. మొత్తంగా 6:1 మెజార్టీతో ఈ తీర్పు వెలువడింది.